ManaEnadu:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమాపై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. కల్కిలో ప్రభాస్ పాత్ర (భైరవ) జోకర్లా ఉందని అర్షద్ వార్సీ అన్న విషయం తెలిసిందే. ఈ కామెంట్స్‌పై టాలీవుడ్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ప్రముఖ నిర్మాతలు, నటులు ఈ విషయంపై స్పందించారు. ప్రభాస్‌కు ఉన్న క్రేజ్, ఆయన మేనియా గురించి తెలియకుండా మాట్లాడారని ఫైర్ అయ్యారు.
నేచురల్ స్టార్ నాని కూడా దీనిపై స్పందించారు. ఇటీవల సరిపోదా శనివారం’ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న నాని ఈ విషయంపై స్పందిస్తూ.. ప్రభాస్‌పై అలాంటి కామెంట్స్ చేసినందుకు అర్షద్‌కు ఎన్నడూ రానంత ఫేమ్ వచ్చిందని అన్నాడు. ఇక అప్పటి నుంచి అర్షద్‌పై నాని చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి. దీంతో నాని తన కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
సరిపోదా శనివారం సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబయిలో ప్రమోషన్స్‌లో బిజీబిజీగా ఉన్నాడు నాని. ఈ సందర్భంగా అక్కడ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అర్షద్‌పై తాను చేసిన కామెంట్స్ గురించి క్లారిటీ ఇచ్చాడు. అతడి గురించి తాను అలా మాట్లాడినందుకు చింతిస్తున్నాననంటూ చెప్పాడు.
“అర్షద్ చాలా మంచి యాక్టర్. మున్నాబాయ్ సినిమా నుంచి ఆయనంటే తెలుగు ప్రేక్షకులకు ఇష్టం. అయితే సెలబ్రిటీ హోదాలో ఉన్నప్పుడు మనం మాట్లాడే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పదాల ఎంపికలోనూ జాగ్రత్తగా ఉండాలని నాకు ఇప్పుడు అర్థమైంది. అలా చేయకపోవడం వల్లే ఇప్పుడు నేను, అర్షద్ బాధితులమయ్యాం.”
” ప్రభాస్ గురించి అర్షద్ చేసిన కామెంట్స్, ఆయనపై నేను చేసిన వ్యాఖ్యలు ఎలా వైరల్‌గా మారాయో నేను చూశాను. ఆ తర్వాత అర్షద్ ఇంటర్వ్యూ మొత్తం చూశాను. ఆ తర్వాతే మీడియా, సోషల్ మీడియా మొత్తం ఆయన కామెంట్స్‌ను తప్పుదోవ పట్టించిందని తెలుసుకున్నా. అది తెలుసుకోకుండా నేను కామెంట్స్ చేశాను. నా మాటలు కూడా మరోవిధంగా జనంలోకి వెళ్లాయి.” అని నాని అసలు సంగతి చెప్పుకొచ్చాడు.
అయితే నాని హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడి, ముంబయికి వెళ్లాక మాట మార్చాడంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సరిపోదా శనివారం హిందీలో కూడా రిలీజ్ అవుతోందని.. అక్కడి మార్కెట్ కోసం మాట మార్చారంటూ ట్రోల్ చేస్తున్నారు. సబ్జెక్ట్ తెలియకుండా మాట్లాడొద్దూ.. నానికి సపోర్టుగా మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.