‘IC 814: ది కాంధార్‌ హైజాక్’ వివాదం.. నెట్‌ఫ్లిక్స్ కంటెంట్‌ హెడ్‌కు సమన్లు

Mana Enadu:ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన సరికొత్త వెబ్ సిరీస్ ‘ఐసీ 814: ది కాంధార్‌ హైజాక్’ (IC 814: The Kandahar Hijack). ప్రముఖ నటుడు విజయ్ వర్మ (Vijay Varma) ప్రధాన పాత్రలో డైరెక్టర్ అనుభవ్ సిన్హా (Anubhav Sinha) తెరకెక్కించిన ఈ సిరీస్ తాజాగా ఓ వివాదంలో చిక్కుకుంది. ఈ క్రమంలో హైజాకర్ల పేర్ల విషయంలో తీవ్ర చర్చ జరుగుతుండగా దీన్ని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా కంటెంట్‌ హెడ్‌కు సమన్లు జారీ చేసింది. ఈ వివాదానికి దారి తీసిన అంశాలపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అసలు ఈ హైజాక్ కథ ఏంటి?

ప్రపంచ ఏవియేషన్‌ చరిత్రలోనే అతి పెద్ద హైజాక్‌గా పేరు పొందింది కాంధార్‌ హైజాక్‌ (Kandahar Hijack). కెప్టెన్ దేవి శరణ్, శ్రింజయ్ చౌదురి ఈ హైజాక్ ఘటనపై ‘ఫ్లైట్‌ ఇన్‌టూ ఫియర్’ అనే పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకం ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ అనుభవ్‌ సిన్హా ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. గతంలో జరిగిన హైజాక్ ఘటనలకు దృశ్యరూపం ఇస్తూ ‘ఐసీ 814: ది కాంధార్‌ హైజాక్‌’ (IC 814 The Kandahar Hijack web series) వెబ్‌సిరీస్‌ను చాలా ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇందులో హైజాకర్ల పేర్ల విషయంలో ఇప్పుడు వివాదం చెలరేగడంతో కేంద్రం చర్యలకు ఉపక్రమించింది.

కాంధార్ హైజాక్ కథేంటి?

176 మంది ప్రయాణికులతో కాఠ్‌మాండు నుంచి దిల్లీకి ‘ఐసీ 814 (IC 814 Plane)’ విమానం బయల్దేరుతుంది. ఈ విమానం ఎక్కిన ఉగ్రవాదులు కెప్టెన్‌ తలపై తుపాకీ పెట్టి విమానాన్ని హైజాక్‌ చేస్తారు. అనంతరం ప్లేన్‌ను కాబూల్‌కు తీసుకెళ్లమని బెదిరిస్తారు. అయితే ఆ విమానం కాబూల్‌ ఎలా చేరింది? ఉగ్రవాదులు విమానాన్ని ఎందుకు హైజాక్‌ చేశారు? వారు చేసిన డిమాండ్‌లు ఏంటి? వాటిని నెరవేర్చే క్రమంలో భారత ప్రభుత్వానికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? ప్రయాణికులు, విమాన సిబ్బందిని భారత ప్రభుత్వం ఎలా కాపాడింది? అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ ((IC 814 The Kandahar Hijack in telugu)) చూడాల్సిందే. నెట్‌ఫ్లిక్స్‌ ఒరిజినల్‌గా ఆగస్టు 29 నుంచి స్ట్రీమింగ్ అవుతుండగా.. సినీ విశ్లేషకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

Related Posts

Naga Chaitanya: స్టైలిష్ లుక్‌లో చైతూ.. ‘NC24’ షూటింగ్ షురూ

‘తండేల్’ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు హీరో అక్కినేని నాగ చైతన్య(Akkineni Naga Chaitanya), డైరెక్టర్ చందూ మొండేటి(Chandu Mondeti) తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్(Box Office) వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *