Pushpa2:రిలీజ్ కు ముందే ‘పుష్పరాజ్‌’ రికార్డ్స్.. భారీ ధరకు ఓటీటీ రైట్స్?

ManaEnadu:ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన పుష్ప(Pushpa Movie)  మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో.. ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో తెలిసిందే. ఒక్కసారిగా స్టైలిష్ స్టార్ ను ఐకాన్ స్టార్ గా మార్చేసింది. అప్పటి వరకు తెలుగు, మలయాళంలో మాత్రమే బన్నీకి ఉన్న హవా ఈ సినిమా తర్వాత బాలీవుడ్ వరకూ వెళ్లింది. అలా ఈ టాలీవుడ్ నటుడిని పాన్ ఇండియా స్టార్ ను చేసింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు పార్ట్ -2 ‘పుష్ప2 :ది రూల్‌ (Pushpa2 : The Rule)’ డిసెంబర్ 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ సూపర్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.అదేంటంటే.. రిలీజ్ కు ముందే పుష్ప సినిమా ఓ క్రేజీ రికార్డు క్రియేట్ చేసిందట. ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకుందట. ఇప్పుడు నెట్టింట ఇది హాట్ టాపిక్ గా మారింది. 

దాదాపు రూ.270 కోట్లకు (Pushpa 2 OTT Rights Price) డీల్‌ పూర్తయినట్లు సమాచారం. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ అన్ని భాషల హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ దక్కించుకున్నట్లు తెలిసింది. ఇది నిజమైతే భారతీయ ఓటీటీ డీల్స్‌లో ఇదే అతి పెద్దది అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. బాక్సాఫీస్‌ వద్దకు వచ్చేందుకు ఇప్పటికే పుష్ప రాజ్ కౌంట్‌డౌన్‌ మొదలైన సంగతి తెలిసిందే. 

‘‘మరో వంద రోజుల్లో అతడి రూల్‌ చూడనున్నారు. అద్భుతమైన అనుభూతిని పొందేందుకు సిద్ధంగా ఉండండి’’ అని పుష్ప టీమ్‌ (Pushpa 2 Count Down) ఇటీవల ప్రకటించింది. ఇందులో రష్మిక మందన్న, ఫహద్‌ ఫాజిల్, సునీల్‌, అనసూయ, జగదీశ్‌ ప్రతాప్‌, ధనుంజయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ మూవీని నిర్మిస్తోంది.

Share post:

లేటెస్ట్