ManaEnadu:ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా పేరు గాంచిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఆ తర్వాత మరో రెండు చిత్రాలకు సైన్ చేసింది తెలిసిందే. ప్రస్తుతం రామ్ చరణ్ చేతిలో గేమ్ ఛేంజర్, బుచ్చిబాబుతో కలిసి మరో సినిమా చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ (RRR) తర్వాత చెర్రీ నుంచి సినిమా రాలేదు. ప్రముఖ డైరెక్టర్ శంకర్ (Shankar)దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వస్తున్న పొలిటికల్ డ్రామా ‘గేమ్ ఛేంజర్ (Game Changer)’ కోసం ఇప్పుడు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజాగా గేమ్ ఛేంజర్ మేకర్స్ చెర్రీ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్పారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసేందుకు రెడీ అయినట్లు తెలిసింది. వినాయక చవితి పండగ (Ganesh Chaturti) రోజున విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. నిర్మాత దిల్‌రాజు ఇదివరకే చెప్పినట్లుగా క్రిస్మస్ పండుగకే ఈ సినిమా రిలీజ్ ఉంటుందని నెటిజన్లు అంటున్నారు.
ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) 2024 డిసెంబర్ 20వ తేదీని లాక్ చేసి పెట్టారట. సెప్టెంబర్ చివరి వారంలో టీజర్ వచ్చే అవకాశం ఉంది. దసరాకు కనీసం ఈ చిత్రం నుంచి ఒక్క గ్లింప్స్ అయినా రిలీజ్ చేయాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి చాలా రోజులే అయినా ముందే సగం పూర్తి చేసిన ‘భారతీయుడు 2’ చిత్రం మిగతా షూటింగ్ కోసం ‘గేమ్ ఛేంజర్’కు శంకర్ బ్రేక్ ఇచ్చారు. అలా పలు కారణాలతో ఈ సినిమా పూర్తి కావడానికి కాస్త ఆలస్యం అవుతోంది.
ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యుయెల్ రోల్లో కనిపించనున్నారట. చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ (Kiara Advani)నటిస్తోంది. సీనియర్ డైరెక్టర్, నటుడు ఎస్జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నారు. అంజలి, శ్రీకాంత్, సముద్రఖని, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు.