ManaEnadu:టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ (Dance Choreographer) జానీ మాస్టర్ గురించి తెలియని వారుండరు. ఢీ (Dhee) అనే డ్యాన్స్ రియాల్టీ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఆ తర్వాత టాలీవుడ్లో వరుస అవకాశాలు అందుకున్నారు. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో స్టెప్పులేయించాడు. ప్రస్తుతం టాలీవుడ్ (Tollywood), కోలీవుడ్‌లలో మోస్ట్ బిజీయెస్ట్ కొరియాగ్రాఫర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇక ఇటీవలే తమిళ్లో తెరకెక్కిన ధనుశ్ (Dhanush) తిరుచిత్రంబళం సినిమాలో మేఘం కరుకత.. పాటకు గానూ 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా అవార్డ్ అందుకున్నాడు.
జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు
కెరీర్ పీక్ స్టేజ్‌లో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ సినిమా ఇండస్ట్రీల్లో బిజీ అయిన జానీ మాస్టర్ (Jani Master) తాజాగా చిక్కుల్లో చిక్కుకున్నాడు. ఆయనపై తాజాగా ఓ కేసు నమోదైంది. ఏకంగా లైంగిక్ వేధింపుల (Sexual Harassment) కేసు నమోదవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఓ యువతి జానీ మాస్టర్‌పై లైంగిక్ వేధింపుల కేసు పెట్టడంతో హైదరాబాద్ రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. జానీ మాస్టర్ తనను కొంతకాలంగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడంటూ అతడి వద్ద పని చేసే ఓ లేడీ యువ కొరియోగ్రాఫర్ (21) ఫిర్యాదు చేసింది.
జానీ మాస్టర్ నన్ను రేప్ చేశారు
ఔట్ డోర్ షూటింగ్స్ కోసం చెన్నై, ముంబయి, వంటి వివిధ నగరాలకు వెళ్లినప్పుడు తనపై అత్యాచారం (Rape) చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అంతే కాకుండా నార్సింగిలోని తన నివాసంలోనూ జానీ మాస్టర్ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని తెలిపింది. ఆమె ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేశారు. అనంతరం నార్సింగి పోలీసులకు కేసు బదిలీ చేశారు. జానీ మాస్టర్ (Jani Master Cases)పై ఐపీసీ సెక్షన్ 376(రేప్), బెదిరింపు (506), గాయపరచడం (323)లోని క్లాజ్ (2), (ఎన్) కింద కేసు నమోదు చేసినట్లు నార్సింగి పోలీసులు తెలిపారు. గతంలోనే ఓ మహిళపై దాడి కేసులో జానీ మాస్టర్‌కు మేడ్చల్ స్థానిక కోర్టు ఆరు నెలలు జైలు శిక్ష విధించింది.