Swag Movie Release Date : ఆడ Ladies Vs మగ Gents.. అందరూ ఆ రోజు థియేటర్‌కు వచ్చేయండి

ManaEnadu:టాలీవుడ్ యంగ్ హీరోల్లో కంటెంట్‌ ఓరియెంటెడ్‌ సినిమాలతో తెరపై కనిపించిన ప్రతిసారి వినోదాన్ని అందించే నటుల్లో శ్రీవిష్ణు (Sree Vishnu) ముందుంటాడు. వరుస సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్లు ఇస్తున్న ఈ హీరో ఇప్పుడు స్వాగ్ (SWAG) అనే కొత్త సినిమాతో వస్తున్న విషయం తెలిసిందే. హసిత్ గోలి దర్శకత్వం వ‌హిస్తున్న ఈ మూవీ టీజర్ ఇటీవలే రిలీజ్ అయింది.

టీజర్‌లో కామెడీతో, మూడు తరాల్లో ఆడ, మగ మధ్య పెత్తనం గురించి అలరించారు. ఈ సినిమాలో శ్రీవిష్ణు సరసన పెళ్లి చూపులు ఫేం రీతూ వర్మ (Ritu Varma) హీరోయిన్‌గా నటిస్తోంది. దక్షా నగార్కర్ మరో కీలక ప్రధాన పాత్రలో నటిస్తోంది. స్వాగ్‌ మూవీలో రీతూవర్మ వింజామర వంశపు రాణి రుక్మిణి దేవి పాత్రలో రాజసం ఉట్టిపడే రాయల్‌ లుక్‌లో అదరగొడుతోంది. బాబా సెహెగల్‌ పాడిన సింగరో సింగ సాంగ్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తోంది.

అయితే ఈ సినిమా (Swag Release Date) నుంచి తాజాగా ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 4వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. “ఆడ Ladies Vs మగ Gents”.. అందరూ అక్టోబర్ 4న థియేటర్లకు వచ్చేయండి.. అంటూ షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
చారిత్రక నేపథ్యం ఉన్న శ్వాగణిక వంశం కథ నేపథ్యంలో కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. వివేక్‌ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి వివేక్ సాగర్ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నాడు. మేకర్స్ ఇప్పటికే స్వాగ్‌లో స్వాగ్‌ ప్రపంచానికి మరింత రాజసం.. అంటూ దక్షా నగార్కర్ లుక్‌ నెట్టింట వైరల్ అవుతోంది.

Related Posts

Bellamkonda Srinivas: హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై కేసు

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై (Bellamkonda Srinivas) కేసు నమోదైంది. రాంగ్ రూట్‌లో కారు నడపడమే కాకుండా ట్రాఫిక్ పోలీస్తో శ్రీనివాస్ దురుసుగా ప్రవర్తించడంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు బుక్ అయ్యింది. ఈనెల 13న జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలోని…

Ram Pothineni: రామ్ కొత్త మూవీ గ్లిమ్స్ వచ్చేసింది.. మూవీ పేరు ఇదే..

రామ్ పోతినేతి (Ram Pothineni), భాగ్య శ్రీ బోర్సే (Bhagyashri Borse) కాంబోలో మహేశ్ బాబు.పి తెరకెక్కిస్తున్న సినిమాకు సంబంధించిన సూపర్ అప్డేట్ వచ్చేసింది. రామ్ పుట్టినరోజు సందర్భంగా మూవీ గ్లిమ్స్ను రిలీజ్ చేశారు. ‘ఆంధ్ర కింగ్ తాలుకా’ (Andhra King…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *