ManaEnadu:తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ (Nandamuri Balakrishna). ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు. మరోవైపు నటుడిగా బాలకృష్ణ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవాన్ని (Balakrishna Golden Jubilee Celebrations) టాలీవుడ్ భారీ స్థాయిలో ఇవాళ (సెప్టెంబరు 1వ తేదీన) నిర్వహించనుంది.
అందరూ ఆహ్వానితులే..
ఇప్పటికే చిరంజీవి (Chiranjeevi), నాగార్జున, వెంకటేష్, అల్లు అర్జున్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, అఖిల్, గోపీచంద్, సాయిధరమ్ తేజ్, సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్‌సేన్‌తోపాటు తమిళ నటులు విజయ్ సేతుపతి, శివ కార్తికేయన్, కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ (Shiva Raj Kumar)లను ఆహ్వానించింది. ఇక నిర్వాహకులు ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని.. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అందరూ రావొచ్చని ఆహ్వానం పలికింది.
నా లవ్లీ బ్రదర్ కు శుభాకాంక్షలు
ఇక బాలయ్య స్వర్ణోత్సవం సందర్భంగా తాజాగా నటుడు రజనీకాంత్ (Rajinikanth) ట్వీట్ చేశారు. ‘‘యాక్షన్ కింగ్.. కలెక్షన్ కింగ్.. డైలాగ్ డెలివరీ కింగ్.. నా లవ్లీ బ్రదర్ బాలయ్య సినీ పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. అద్భుతమైన పాత్రలు పోషిస్తూ ఇలాగే ముందుకు సాగుతున్నారు. ఇదొక గొప్ప విజయం. ఆయనకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలతో ప్రశాంతంగా, ఆనందంగా బాలయ్య జీవించాలని కోరుకుంటున్నాను ’’ అని తలైవా ట్వీట్ లో పేర్కొన్నారు. బాలకృష్ణ (Nandamuri Balakrishna)కు పలువురు నెటిజన్లు విషెస్ తెలుపుతున్నారు.
నందమూరి బాలకృష్ణ తొలి చిత్రం ‘తాతమ్మ కల (Tatamma Kala)’ విడుదలై ఈ ఏడాదితో యాభయ్యేళ్లు పూర్తైన విషయం తెలిసిందే. బాలయ్య తన సినీ కెరీర్ లో ఫ్యాక్షన్, పౌరాణికం, యాక్షన్, సైన్స్ ఫిక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్.. ఇలా ఎన్నో విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. గతేడాది ‘భగవంత్ కేసరి (Bhagavant Kesari)’తో అలరించారు బాలకృష్ణ. ప్రస్తుతం ఆయన బాబీ దర్శకత్వంలో NBK 109 సినిమా తెరకెక్కుతోంది.