ఈ వారమే విజయ్ ‘ది గోట్’.. నివేదా ’35 చిన్న కథ కాదు’ రిలీజ్. మరి ఓటీటీలో ఏవంటే?

Mana Enadu:ఆగస్టులో పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. అందులో కొన్ని చిత్రాలు వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు అదే జోష్‌తో సెప్టెంబరులోకి అడుగుపెట్టాం. ఈ నెల తమిళ దళపతి విజయ్‌ గోట్‌ (Vijay The GOAT) సినిమాతో గ్రాండ్‌గా ప్రారంభమై.. మ్యాన్ ఆఫ్ మాసెస్‌ ఎన్టీఆర్ నటించిన దేవర (NTR Devara)తో ఘనంగా ముగియబోతోంది. మరి ఈ వారంలో ఏయే సినిమాలు మిమ్మల్ని అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి? అలాగే ఓటీటీలో మిమ్మల్ని ఆకట్టుకునేందుకు ఎలాంటి సినిమాలు, వెబ్ సిరీస్‌లు రాబోతున్నాయో చూద్దామా?

థియేటర్‌లో అలరించనున్న చిత్రాలు ఇవే

థ్రిల్లర్‌ ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌

దళపతి విజయ్ ప్రధాన పాత్రలో వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ‘ది గోట్‌’ (The Greatest of All Time) సినిమా సెప్టెంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మీనాక్షి చౌదరి కథానాయిక. స్నేహ, లైలా, ప్రశాంత్‌, ప్రభుదేవా కీలక పాత్రలు పోషించారు. ‘డీ-ఏజింగ్‌ టెక్నాలజీ’ తో ఇందులో విజయ్‌ని పాతికేళ్ల కుర్రాడిలా చూపించనున్నారు.

35 చిన్న కథ కాదు

జెంటిల్‌మెన్ ఫేం నివేదా థామస్‌ (Nivetha Thomas) ప్రధాన పాత్రలో దగ్గుబాటి రానా సమర్పణలో తెరకెక్కిన చిత్రం ‘35 చిన్న కథ కాదు’ (35 Chinna Katha Kaadu). నందకిశోర్‌ ఇమాని దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళంలలో సెప్టెంబర్‌ 6న విడుదల కానుంది. ఇందులో నివేదా తల్లి పాత్ర పోషించారు. , విశ్వదేవ్‌ ఆర్‌, ప్రియదర్శి (Priyadarshi) ప్రధాన పాత్రల్లో నటించారు.

జనక అయితే గనక’

విలక్షన స్క్రిప్టులు ఎంచుకుంటూ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు నటుడు సుహాస్. ఆయన హీరోగా దర్శకుడు సందీప్‌రెడ్డి బండ్ల తెరకెక్కించిన చిత్రం ‘జనక అయితే గనక’ (Janaka Aithe Ganaka). వెన్నెల కిశోర్‌, రాజేంద్ర ప్రసాద్‌ కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రం సెప్టెంబరు 7న ప్రేక్షకుల ముందుకురానుంది. .

ఈ వారం ఓటీటీలో అలరించనున్న సినిమాలు/సిరీస్‌లు ఇవే

డిస్నీ+హాట్‌స్టార్‌

బ్రిక్‌ టూన్స్‌ (ఇంగ్లీష్‌) సెప్టెంబరు 4
కిల్‌ (హిందీ) సెప్టెంబరు 6

సోనీలివ్‌

తానవ్‌ 2 (హిందీ) సెప్టెంబరు 6

నెట్‌ఫ్లిక్స్‌

అపోలో 13: సర్వైవల్‌ (డాక్యుమెంటరీ) సెప్టెంబరు 05
ది పర్‌ఫెక్ట్‌ కపుల్‌ (ఇంగ్లీష్‌) సెప్టెంబరు 05
బ్యాడ్‌బాయ్స్‌: రైడ్ ఆర్‌ డై (ఇంగ్లీష్‌) సెప్టెంబరు 6
రెబల్‌ రిడ్జ్ (ఇంగ్లీష్‌) సెప్టెంబరు 06

Share post:

లేటెస్ట్