ManaEnadu: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీ నుంచి హిరోగా మరో సినిమా ముస్తాబు అవుతుంది. విరాన్ ముత్తంశెట్టి (Viran Muttamsetty)హీరోగా ఇప్పుడో కొత్త చిత్రం రాబోతోంది. ఓ విభిన్నమైన చిత్రంతో అల్లు అర్జున్(Allu Arjun) కజిన్ విరాన్ ముత్తంశెట్టి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన హీరోగా నటిస్తోన్న చిత్రానికి ‘గిల్ట్’(Guilt) అనే టైటిల్‌ని ఖరారు చేసి.. వినాయకచవితి స్పెషల్‌గా టైటిల్ లుక్ పోస్టర్‌ని చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.
విరాన్ ముత్తంశెట్టి ఇప్పటికే పలు సినిమాల్లో నటించి ఆడియెన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు హీరోగా ‘గిల్ట్’తో తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీ యూత్ ఫుల్ లవ్ స్టోరీతో పాటుగా క్రైమ్, యాక్షన్, థ్రిల్లర్‌గా ఉండబోతోందని మేకర్స్ చెబుతున్నారు. (Guilt Title Look Poster)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కజిన్ విరాన్ ముత్తంశెట్టి (Viran Muttamsetty) హీరోగా ఇప్పుడు కొత్త చిత్రం రాబోతోంది. ప్రస్తుతం డిఫరెంట్ కంటెంట్ బేస్డ్ చిత్రాలను ప్రేక్షకులు బాగా ఇష్టపడుతున్నారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల కంటే కాస్త భిన్నమైన కాన్సెప్ట్‌తో వచ్చే సినిమాలే బాక్సాఫీస్ వద్ద ఎక్కువగా సక్సెస్ అవుతున్నాయి. ఇప్పుడలాంటి ఓ విభిన్నమైన చిత్రంతో అల్లు అర్జున్ కజిన్ విరాన్ ముత్తంశెట్టి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన హీరోగా నటిస్తోన్న చిత్రానికి ‘గిల్ట్’ (Guilt) అనే టైటిల్‌ని ఖరారు చేసి.. వినాయకచవితి స్పెషల్‌గా టైటిల్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.
శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ బ్యానర్‌పై లక్ష్మీ సునీల, డా. పార్థసారథి రెడ్డి, ఎ. శివ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి చలపతి పువ్వల దర్శకత్వం వహిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్‌గా P శ్రీనివాస్, D శ్రీనివాస్ (వాసు) వ్యవహరిస్తున్నారు. ఈ టైటిల్ లుక్ పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. టైటిల్‌తోనే సినిమాపై అందరి దృష్టి పడేలా మేకర్లు ప్లాన్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే మేకర్స్ తెలియజేయనున్నారు.