Mana Enadu: మెగా ఫ్యామిలీ కోడలు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు సోషల్ మీడియాలో ఉండే ఈమె.. అపోలో ఫౌండేషన్ వైస్ ఛైర్మన్‌గానూ ఉన్నారు. అంతేకాదు ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొని అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ముఖ్యంగా కరోనా సమయంలో ఎంతో మందికి ఉపాసన సాయం చేసి గొప్ప మనసు చాటారు. మారుమూల గ్రామాలు, వృద్ధాశ్రమాలలో కూడా వైద్య సేవలు అందించడంతోపాటు ఆర్థికంగానూ చేయూతనిచ్చారు. ఇప్పటికీ ఆమె దాదాపు 150 రాష్ట్రాల్లోని వృద్ధాశ్రమాలకు సాయం చేస్తున్నారు కూడా.
* వారికి తగిన గౌరవాన్నిద్దాం..
అయితే 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని యావత్తు దేశం ఎంతో సంబరంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీ కోడలు సోషల్ మీడియాలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ప్రస్తుతం ఎలాంటి స్వాతంత్ర్యాన్ని జరుపుకుటున్నామని నిలదీశారు. ముఖ్యంగా కోల్‌కతాలో జరిగిన ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటనను లేవనెత్తారు. ‘మానవత్వాన్నే అపహాస్యం చేసే ఘటన ఇది. సమాజంలో అనాగరికత కొనసాగుతుంటే మనం ఎలాంటి స్వాతంత్య్రాన్ని జరుపుకుంటున్నాం? దేశ ఆరోగ్య సంరక్షణకు మహిళలే వెన్నెముక. ఎక్కువ మంది స్త్రీలను వర్క్‌ఫోర్స్‌లోకి తీసుకురావాలనే నా లక్ష్యం బలపడింది. వారికి భద్రత, గౌరవాన్ని అందించేందుకు కృషి చేద్దాం’ అని ట్వీట్ చేశారు. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు ఆమె ట్వీట్‌ను రీట్వీట్ చేస్తుండగా.. కొందరు ఆమె వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు.
* గతంలో మహిళలకు సూచనలు
గతంలో ఉపాసన చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మహిళలు వారి అవసరాలకు అనుగుణంగా మెటర్నిటీ లీవ్స్ తీసుకునే అవకాశం కంపెనీలు కల్పించాలనీ చెప్పారు. ఇక ఆడవాళ్లు వారి ఎగ్స్‌ను కాపాడుకోవాలని సూచించారు. అంతేకాదు వాటికి ఇన్సూరెన్స్ కూడా చేయించుకోవాలని ఆమె సూచనలు చేశారు. లైఫ్‌లో సెటిల్ అయ్యిన తర్వాతే పిల్లల కోసం ప్రయత్నించాలని అనుకునే వారికి ఈ ఎగ్స్ దాచుకునే విధానం బాగుంటుందని ఆమె తెలిపారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన తర్వాత పిల్లల్ని కనాలని అనుకున్నప్పుడూ ఆ ఎగ్స్ ఉపయోగపడతాయని ఆమె పేర్కోన్నారు. తాను కూడా ఇదే విధానాన్ని అనుసరించానని.. ఎగ్స్ ను దాచుకున్నానని సరైన సమయం అనుకున్నప్పుడే పిల్లలని కన్నామని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. కాగా రామ్‌చరణ్, ఉపాసన దంపతులకు క్లీంకార జూన్ 20, 2023న జన్మించింది.
https://x.com/upasanakonidela/status/1823899265212563645