Nirmala Sitharaman: ఇకపై ఆ బ్యాంకుల్లో నో మినిమం బ్యాలెన్స్ లిమిట్

Mana Enadu:ఈ రోజుల్లో చాలా బ్యాంకుల్లో అకౌంట్ ఓపెన్ చేయడానికి మనీ అవసరం లేదు. ఎందుకంటే చాలా బ్యాంకులు జీరో బ్యాలెన్స్ ఖాతా ఓపెన్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. అలాగే బ్యాంకింగ్ సంబంధిత పని చాలా వరకు ఫోన్ ద్వారా మాత్రమే జరుగుతోంది. ఖాతాదారులు వారి UPI యాప్, నెట్ బ్యాంకింగ్ ద్వారా లావాదేవీలు చేయవచ్చు. ఇదిలా ఉండగా చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉన్నాయి. కొన్ని ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ కూడా నిర్వహించడం లేదు. దీని వల్ల వారి ఖాతా మైనస్ బ్యాలెన్స్ అవుతుంది. దీంతో బ్యాంకులు ఫైన్ విధించడం జరుగుతుండేది. కానీ తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంక్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్ చెప్పారు. అదేంటంటే..

జన్‌ధన్ ఖాతాలతో పాటు బేసిక్ సేవింగ్స్ ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ ఉండాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. తమ ఖాతాలలో మినిమం బ్యాలెన్స్ ఉంచని ఖాతాదారుల నుంచి బ్యాంకులు వేలాది కోట్ల రూపాయలు వసూలు చేశాయన్న అంశంపై రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ స్పందించారు. ప్రధాన మంత్రి జన్‌ధన్ ఖాతాలు, పేదలకు చెందిన సేవింగ్స్ ఖాతాలలో మినిమం బ్యాలన్స్ ఉంచాల్సిన అవసరం లేదని ఆమె మంగళవారం ప్రకటించారు. తమ బ్యాంకు ఖాతాలలో తగిన మొత్తంలో బ్యాలన్స్ తప్పనిసరిగా ఉంచాల్సిన ఖాతాదారులు ఆ నిబంధనను పాటించనప్పుడే వారికి బ్యాంకులు పెనాల్టీలు విధిస్తాయని స్పష్టం చేశారు.

మరోవైపు 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి 5 సంవత్సరాల కాలంలో పీఎస్‌బీలు రూ.8,500 కోట్ల జరిమానా వసూలు చేసినట్లు లోక్‌‌సభలో ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. ఇందులో 2023-24 ఆర్థిక సంవత్సరంలోనే డిపాజిటర్ల నుంచి రూ.2,331 కోట్లు వసూలు చేసినట్లు చెప్పారు.

Share post:

లేటెస్ట్