ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. తాజాగా భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావు(ASP BHUJANGA RAO)ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతి రావు కలిసి ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు విచారణలో పోలీస్ అధికారులు గుర్తించారు.
మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రతి రోజు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఐ న్యూస్ (I NEWS) ఎండీ శ్రావణ్ పాత్రపై కీలక ఆధారాలు పోలీసుల విచారణలో లభ్యం అయినట్లు సమాచారం. ఇక భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విచారణకు పిలిచి ప్రశ్నించి ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పోలీసులు ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. ఇంటలిజెన్స్ పొలిటికల్ వింగ్ లో అదనపు ఎస్పీగా భుజంగరావు పనిచేశారు. ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతి రావు కలిసి ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు విచారణలో పోలీస్ అధికారులు గుర్తించారు.
సస్పెండెడ్ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావుపై కేసు నమోదు అయింది. పంజాగుట్ట పీఎస్‌లో SIB అధికారులు ప్రణీత్‌రావుపై ఫిర్యాదు చేశారు. SIB మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుతో పాటు సహకరించిన మరికొందరు అధికారులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు. ప్రణీత్‌రావు మీద ipc 409, 427, 201, 120(బీ), PDPPయాక్ట్, ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.