Semiconductors: ఎలక్ట్రానిక్ రంగంలో 60లక్షల ఉద్యోగాలు: PM మోదీ

ManaEnadu: ప్రపంచం కొత్తపుంతలు తొక్కుతోంది. డిజిటల్ టెక్నాలజీ(Digital Technology)పై అన్నిదేశాలూ వడివడిగా అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా అన్నిరంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతున్న భారత్‌(India)లో సాంకేతికత నిత్యనూతనండా పరిణమిస్తోంది. తాజాగా ఇదే మాటను భారత ప్రధాని(PM Modi) మరోసారి నొక్కి చెప్పారు. భారత్‌లో సెమీ కండక్టర్ల(Semiconductor) తయారీ కంపెనీలు పెట్టుబడి(Investment) పెట్టేందుకు ఇదే సరైన సమయమని మోదీ అన్నారు. ‘ఈ దశాబ్దం చివరి నాటకి స్థానిక ఎలక్ట్రానిక్ రంగం(Electronic sector) విలువను $150 బిలియన్ల నుంచి $500 బిలియన్లకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. దాంతో 60 లక్షల ఉద్యోగాలు(Jobs) క్రియేటవుతాయి. చిప్‌లు తక్కువైనప్పుడు మీరు భారత్‌ను నమ్ముకోవచ్చు. స్టూడెంట్స్(Students), వర్క్‌ఫోర్స్‌(Workforce)ను సెమీకండక్టర్ రంగం కోసం సిద్ధం చేస్తాం’ అని చెప్పారు. ఈరోజు ప్రధాని తన నివాసంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం(Round table meeting)లో సెమీకండక్టర్ల తయారీపై మాట్లాడారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లోని అనుభవజ్ఞులతో ప్రధాని చర్చించారు.

 భారత్‌లో ప్రతిభకు కొదవలేదు: ప్రధాని మోదీ

భారతదేశంలో ప్రతిభకు కొదవలేదు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌(Skill Development) ద్వారా వారిని పరిశ్రమలను సమర్థంగా తీర్చిదిద్దడంలో ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు. మీ ఆలోచనలు(Thoughts) వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడమే కాకుండా దేశ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తాయని ప్రధాని అన్నారు. డిజిటల్(Digital) యుగానికి సెమీకండక్టర్ ఆధారమని తెలిపారు. ప్రజాస్వామ్యం, సాంకేతికత మానవాళి ప్రయోజనం కోసం కలిసి పనిచేయాలని సూచించారు. సెమీకండక్టర్ రంగంలో శక్తివంతమైన దేశంగా ఎదగడానికి భారత్‌కు అన్ని సామర్థ్యాలు ఉన్నాయని, INDIAలో గరిష్ఠ సంఖ్యలో సెమీకండక్టర్ల(Semiconductors)ను తయారు చేయడం ద్వారా తాము మా అవసరాలను తీర్చడమే కాకుండా ప్రపంచానికి సరఫరా చేస్తామని(supply chain resilience) వెల్లడించారు. విధానాలను మెరుగుపరచడం ద్వారా తమ సహకారం ఉంటుందని మోదీ హామీ ఇచ్చారు. అలాగే సెమీకండక్టర్‌ పరిశ్రమకు ప్రభుత్వం పూర్తి సహకారాలు ఉంటాయని ప్రధాని అన్నారు. ప్రపంచం మొత్తం సెమీకండక్టర్ పరిశ్రమ దృష్టి ఇప్పుడు భారత్‌పైనే ఉందన్నారు. ఈ సమావేశంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌(Ashwini Vaishnav)తో పాటు పలు సెమీకండక్టర్ కంపెనీల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 మూడు రోజుల పాటు కొనసాగనున్న సెమికాన్ ఈవెంట్
ఇదిలా ఉండగా సెమీకండక్టర్ పరిశ్రమపై దృష్టి సారించిన గ్లోబల్ ఈవెంట్ సెమికాన్ ఇండియా 2024(Global Semicon Event India 2024)ను ప్రధాని ప్రారంభించారు. మూడు రోజుల సదస్సు, “షేపింగ్ ది సెమీకండక్టర్ ఫ్యూచర్(Shaping the Semiconductor Future)” అనే థీమ్‌తో 250 మందికి పైగా ఎగ్జిబిటర్లు(Exhibitors), 150 మంది స్పీకర్లతో సహా పరిశ్రమ నుండి కీలకమైన వ్యక్తులను ఒకచోట చేర్చనుంది. గ్లోబల్ సెమీకండక్టర్ హబ్‌గా మారడానికి భారత్ నిబద్ధతను ఈ ఈవెంట్ హైలైట్ చేయనుంది సెమీకండక్టర్ల తయారీలో స్వయం ప్రతిపత్తి కోసం దేశం కృషి చేస్తోంది. 2021లో ప్రారంభించిన ఇండియన్ సెమీకండక్టర్ మిషన్ (ISM), ఈ ప్రయత్నంలో కీలక భాగం. భారతదేశంలో చిప్‌(Chips) తయారీ ప్లాంట్లను స్థాపించడానికి కంపెనీలను ఆకర్షించడానికి ఆర్థిక ప్రోత్సాహకాలు, రాయితీలను అందించడం దీని లక్ష్యం.

Share post:

లేటెస్ట్