ManaEnadu: ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) ఇంటికి ఓ కొత్త మిత్రుడు(New Friend) వచ్చాడు. ఆ మిత్రుడి రాకపట్ల ప్రధాని మోదీ చాలా సంతోషం వ్యక్తం చేశారు. పైగా పూల మాల వేసి, శాలువాతో ప్రధాని ఘనంగా సత్కరించి గ్రాండ్ తన ఇంట్లోకి(Grand Welcome) ఆహ్వానించారు. ఇంతకీ ఎవరా మిత్రుడు.. ఏంటి అతని స్పెషల్(Special) అనుకుంటున్నారా? అవునండీ.. అతను భారత ప్రధానికి వెరీ స్పెషల్ ఫ్రెండే. ఇంతకీ అతను ఎవరు.. ఎక్కడి నుంచి వచ్చాడు. ఏం చేస్తాడు అనే వివరాలు ఏంటో తెలుసుకుందాం పదండి మరి..
దీపోజ్యోతి రాకతో ప్రధాని సంతోషం
ఇంతకీ అతనెవరో కాదు. ఓ ఆవు దూడ(cow calf). ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్(Lok Kalyan Marg)లోని ప్రధాని నివాసంలో పెంచుకుంటున్న పుంగనూరు ఆవు తాజాగా దూడకు జన్మనిచ్చింది. భూమిపైకి దాని రాకతో మోదీ సంతోషం వ్యక్తం చేశారు. స్వయంగా తన ఇంట్లోని దేవి విగ్రహం వద్దకు తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతటితో ఆగకుండా దానికి ప్రధానినే పూలమాల వేసి శాలువాతో సత్కరించారు. దానిని ఎత్తుకొని మురిసిపోయారు. ఒళ్లో కూర్చొబెట్టుకొని ముద్దుపెట్టుకున్నారు. ఆ దూడ నుదుటిపై తెల్లటి రేఖతో పుట్టిందని పేరు కూడా పెట్టారు. ‘‘ఇది కాంతికి చిహ్నంగా ఉందని ఈ విశిష్ట లక్షణంతో పుట్టిన దూడకు ‘దీపోజ్యోతి (Deepjyoti)’ అని పేరు పెడుతున్నా’’ అని ప్రధాని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను ప్రధాని తన సోషల్ మీడియా(Social Media) అకౌంట్లోలో షేర్ చేశారు.
హిందీ దివస్ శుభాకాంక్షలు
ఈ సందర్భంగా.. ‘గావ్: సర్వసుఖా ప్రద:’ అనే లేఖనాన్ని ప్రస్తావిస్తూ తన కుటుంబంలోకి కొత్త వ్యక్తి రాకను ప్రధాని మోదీ ప్రస్తావించారు. ‘‘’గావ్ సర్వసుఖ్ ప్రదాహ్’ అని మన గ్రంథాలలో చెప్పారు. లోక్ కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాన మంత్రి నివాస ప్రాంగణానికి కొత్త సభ్యుడు శుభప్రదంగా చేరుకున్నారు’’ అని మోదీ ట్విటర్(Twitter)లో హిందీలో ఓ పోస్ట్(Post)లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శనివారం హిందీ దివస్ సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘హిందీ దివస్(Hindi diwas) సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు’ అని ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. 1949లో రాజ్యాంగ సభ హిందీని అధికార భాషగా స్వీకరించినందుకు గుర్తుగా ఏటా September 14న హిందీ దివస్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే.
దేశీయ గోవు జాతుల పరిరక్షణ కోసం..
దేశీయ గోవు జాతుల పరిరక్షణ కోసం డిసెంబర్ 2014లో కేంద్రం రాష్ట్రీయ గోకుల్ మిషన్(Rashtriya Gokul Mission) ప్రారంభించింది. ఈ పథకం కింద దేశీయ గోవుల పాల ఉత్పత్తిని పెంపొందించడం, గ్రామీణ భారతదేశంలోని రైతులకు పాడి పరిశ్రమను మరింత లాభదాయకంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధానమంత్రి అధికారిక నివాసంలో ఉన్న జంతువులలో పుంగనూరు ఆవులు(Punganur cows) ఎక్కువగా ఉన్నాయి. ఇవి 2 అడుగుల 4 అంగుళాల నుంచి 3 అడుగుల వరకు ఎత్తు పెరుగుతాయి. ఇవి 115 నుంచి 200 కిలోల బరువు ఉంటాయి. ఎక్కువగా బూడిద, తెలుపు రంగుల్లో ఉంటాయి. విశాలమైన నుదురు, చిన్న కొమ్ములు వీటి ప్రత్యేకత కాగా, తోక మాత్రం నేలను తాకుతూ ఉంటుంది. పుంగనూరు ఆవు పాలలో ఔషధ గుణాలు ఉంటాయని స్థానిక రైతులు(Farmers) విశ్వసిస్తారు. ది హిందూ(The Hindu) పత్రిక 2020 నివేదిక ప్రకారం, పుంగనూరు జాతి ఆవు మూత్రం లీటరు రూ. 10కి, పేడ కిలో రూ. 5కి అమ్ముడవుతోంది. వాటి యాంటీ బాక్టీరియల్(Antibacterial) విలువను బట్టి పంటలపై పిచికారీ చేయడానికి వాటిని క్రిమిసంహారకాలుగా ఉపయోగిస్తారు.
हमारे शास्त्रों में कहा गया है – गाव: सर्वसुख प्रदा:'।
लोक कल्याण मार्ग पर प्रधानमंत्री आवास परिवार में एक नए सदस्य का शुभ आगमन हुआ है।
प्रधानमंत्री आवास में प्रिय गौ माता ने एक नव वत्सा को जन्म दिया है, जिसके मस्तक पर ज्योति का चिह्न है।
इसलिए, मैंने इसका नाम 'दीपज्योति'… pic.twitter.com/NhAJ4DDq8K
— Narendra Modi (@narendramodi) September 14, 2024