ManaEnadu: కాంగ్రెస్ ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ తెలిపింది. త్వరలోనే అర్హులకు రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు వేరువేరుగా ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులకు రేషన్ కార్డులు జారీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మందికి పైగా రేషన్ కార్టుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవలే రేవంత్ సర్కార్ రైతు రుణమాఫీ కూడా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు ప్రజా పాలన దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత.. ఇలా అయిదు పథకాలు అర్హులకు అందించేందుకు కొన్ని నెలల క్రితం దరఖాస్తులు స్వీకరణ ప్రారంభించింది. అయితే పలు పథకాలకు రేషన్ కార్డును లింక్ చేయడం.. అది లేనివారు నష్టపోతున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అర్హులకు త్వరలోనే రేషన్ కార్డులు జారీ చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ కసరత్తులు చేస్తోంది.
Rashmika Mandanna: ‘ఛావా’ ప్రమోషన్స్.. రష్మిక కామెంట్స్‌పై కన్నడిగుల ఫైర్
ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో నేషన్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) జోరు కొనసాగుతోంది. టాలీవుడ్(Tollywood), బాలీవుడ్(Bollywood) అనే తేడా లేకుండా వరుసబెట్టి ఆఫర్లు సొంతం చేసుకుంటోంది. దీంతో దక్షిణాది ఇండస్ట్రీలలో ఆమె పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఇటీవల యానిమల్(Animal), పుష్ప-2(Pushpa2)తో సూపర్…