ManaEnadu:ఖలీద్ బిన్ మొహసేన్ షారీ.. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యధిక బరువున్న వ్యక్తి. ఇప్పుడు ఏకంగా 542 కేజీల బరువు తగ్గిపోయి 610 కేజీల నుంచి 60 కేజీలకు వచ్చేశాడు. అయితే ఖలీద్ బరువు ప్రయాణంలో అతడికి ఓ రాజు ఎంతో సహకరించాడు. ఆయన సాయంతోనే ఖలీద్ ప్రాణం నిలిచిందని చెప్పొచ్చు. మరి ఖలీద్ 600 నుంచి 60 కేజీల వరకు ఎలా తగ్గాడో తెలుసుకుందామా..?
సౌదీ అరేబియాకు చెందిన ఖలీద్ 2013లో 610 కేజీల బరువు పెరిగాడు. భారీ దేహంతో నానా అవస్థలు పడేవాడు. సాధారణంగా 80 నుంచి 100 కేజీలుంటేనే రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలాంటి 600 కేజీలంటే ఇక ఎలా ఉంటుందో పరిస్థితి ఊహించుకోండి. అలా ఖలీద్ అధికర బరువు వల్ల మూడేళ్లపాటు మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది. తన పనులు కూడా తాను చేసుకోలేని పరిస్థితి. ఇంకొన్నాళ్లు అలాగే ఉంటే ఆయన ప్రాణానికి ముప్పు వచ్చేది. కానీ అలా జరగలేదు.
ఖలీద్ స్టోరీ విన్న మునుపటి సౌదీ రాజు అబ్దుల్లా అతడికి సాయం చేసి కాపాడాలని నిర్ణయించుకున్నారు. తన సొంత ఖర్చులతో ఖలీద్‌కు వైద్య సేవలు అందించారు. మొదటగా ప్రత్యేకంగా ఒక బెడ్ డిజైన్ చేయించి అతడిని రియాద్‌లోని కింగ్ ఫాహద్ మెడికల్ సిటీకి తరలించి ప్రత్యేకంగా వైద్యులను నియమించారు. 30 మంది వైద్యులు ఎప్పటికప్పుడు ఖలీద్‌కు చికిత్స చేయడం మొదలు పెట్టారు.
మొదట ఒక డైట్ చార్ట్ రెడీ చేశారు. ఆ తర్వాత గ్యాస్ట్రిక్ బైపాప్ సర్జరీ చేసి శరీరంలో కదలికలను పునరుద్ధరించేందుకు వ్యాయామాలు చేయించం మొదలు పెట్టారు. అలా నెమ్మదిగా ఆయన శరీరంలో కదలికలు స్పీడ్ పెంచాక.. ఫిజియోథెరపీ నిర్వహించడంతో ఆరు నెలల్లో సగానికి సగం బరువు తగ్గాడు. 2023లో 542 కేజీలు తగ్గి అందర్నీ షాక్‌కు గురిచేశాడు. 600 కేజీలున్న వ్యక్తి కాస్తా 60 కేజీలతో హెల్దీ మ్యాన్ అయ్యాడు. అయితే ఈ ప్రాసెస్‌లో అదనపు చర్మం తొలగించేందుకు కొన్ని సర్జరీలు చేయాల్సి వచ్చిందని డాక్టర్లు చెప్పారు. బరువు తగ్గిన ఖలీద్‌ను ఇప్పుడు అందరూ స్మైలింగ్ మ్యాన్ అంటూ పిలుస్తున్నారు.
Rashmika Mandanna: ‘ఛావా’ ప్రమోషన్స్.. రష్మిక కామెంట్స్‌పై కన్నడిగుల ఫైర్
ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో నేషన్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) జోరు కొనసాగుతోంది. టాలీవుడ్(Tollywood), బాలీవుడ్(Bollywood) అనే తేడా లేకుండా వరుసబెట్టి ఆఫర్లు సొంతం చేసుకుంటోంది. దీంతో దక్షిణాది ఇండస్ట్రీలలో ఆమె పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఇటీవల యానిమల్(Animal), పుష్ప-2(Pushpa2)తో సూపర్…