స్టార్ హీరోలకు శ్రద్ధా కపూర్ షాక్.. బాక్సాఫీస్ వద్ద స్త్రీ2 సునామీ.. అత్యంత వేగంగా రూ.400 కోట్లు

ManaEnadu:బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ స్టార్ హీరోలకు గట్టి షాక్ ఇచ్చింది. ఈ భామ నటించిన స్త్రీ2 సినిమా విడుదలకు ముందు నుంచే రికార్డులు సృష్టిస్తూ వస్తోంది. ఇక విడుదలైన వారంలోనే రూ.400 కోట్ల వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అమర్‌ కౌశిక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘స్త్రీ 2’ అత్యంత వేగంగా రూ.400 కోట్లు వసూళ్లు చేసిన చిత్రంగా రికార్డు సృష్టించింది. అక్షయ్ కుమార్, జాన్ అబ్రహం వంటి స్టార్​లు నటించిన ఖేల్ ఖేల్ మే, వేదా వంటి సినిమాలను దీటుగా తట్టుకుని కలెక్షన్ల సునామీ కురిపిస్తోంది.

శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ హార్రర్ కామెడీ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోస్తోంది. ఫస్ట్ డే నుంచి వసూళ్ల వర్షం కురిపిస్తున్న ఈ చిత్రం వారంలోనే ఏకంగా రూ.400 కోట్ల మార్క్​ను క్రాస్ చేసి సెన్సేషనల్ రికార్డు సెట్ చేసినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇండియన్ గ్లోబల్ బాక్సాఫీస్ ముందు రూ.342 కోట్లు గ్రాస్​, ఓవర్సీస్​ గ్లోబల్​లో రూ.59 కోట్లు గ్రాస్​, మొత్తం రూ.401 కోట్లు వసూల్ చేసినట్లు మేకర్స్ తెలిపారు. మొదటి వారంలోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

2018లో విడుదలైన స్త్రీ చిత్రానికి సీక్వెల్‌గా స్త్రీ 2ను రూపొందించిన విషయం తెలిసిందే. జియో స్టూడియోస్, మ్యాడోక్‌ ఫిల్మ్‌ సంస్థ కలిసి సినిమాను నిర్మించగా.. ఈ చిత్రంలో స్టార్ హీరోలు అక్షయ్‌ కుమార్, వరుణ్‌ ధావన్‌, పంకజ్‌ త్రిపాఠి, అపర్ శక్తి ఖురానా కీలక పాత్రల్లో నటించారు. ముఖ్యంగా సినిమాలోని సీరియస్ సన్నివేశాలను కూడా కామెడీ ట్రాక్​లో చూపించడం ఆడియెన్స్​ను బాగా ఆకట్టుకుంటోంది. మరోవైపు ఈ చిత్రంలో తమన్నా భాటియా స్పెషల్ సాంగ్​తో ఆకట్టుకుంది.

Share post:

లేటెస్ట్