పారాలింపిక్స్​లో భారత్ బోణీ – షూటింగ్ లో పసిడి, కాంస్యం.. పరుగుపందెంలో బ్రాంజ్

ManaEnadu:పారిస్ వేదికగా పారాలింపిక్స్ క్రీడలు (Paralympics 2024) జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఆటల్లో ఇవాళ (ఆగస్టు 30వ తేదీ) భారత్ బోణీ కొట్టింది. ఒకేరోజు మూడు పతకాలు గెలుపొందింది. అది కూడా ఒక్క క్రీడలోనే ఏకంగా రెండు పతకాలు సాధించింది. ఇవాళ్టి క్రీడల్లో.. స్టార్ పారా షూటర్ అవని లెఖారా (Shooter Avani Lekhara) సత్తా చాటింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్​లో 249.7పాయింట్లతో  అవని పసిడి పతకం గెలుచుకుంది. 

గత టోక్యో పారాలింపిక్స్​లోనూ అవని బంగారు పతకం (Paralympics India Gold) సాధించింది. ఈసారి పారిస్​లోనూ సత్తా చాటి బ్యాక్ టు బ్యాక్ భారత్ కు గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చింది. పారాలింపిక్స్​లో రెండు గోల్డ్ మెడల్స్​ నెగ్గిన రెండో భారత పారా అథ్లెట్​గా అవని రికార్డు క్రియేట్ చేసింది. మరోవైపు ఇదే ఈవెంట్​లో మోనా అగర్వాల్ 228.7 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచి కాంస్యం (Paralympics Bronze) దక్కించుకుంది.  సౌత్ కొరియా పారా అథ్లెట్ యె లీ (Y Lee) 246.8 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి సిల్వర్ గెలుచుకుంది.

11 ఏళ్ల వయసులో కారు ప్రమాదానికి గురికావడంతో అవని కాళ్లు రెండూ చచ్చుబడిపోగా.. ఆ తర్వాత ఆమె మొదట ఆర్చరీ వైపు వెళ్లింది. ఆ తర్వాత షూటింగ్ ఎంచుకోగా ఈ షూటింగ్ ఆమెను ఒలింపిక్స్ వరకూ తీసుకెళ్లింది. అలా మొదట టోక్యో, ఇప్పుడు పారిస్‌లో వరుస పారాలింపిక్స్‌లో ‘బంగారు’ కొండగా నిలిచింది.

పారాలింపిక్స్‌లో భారత్‌ కు మూడో పతకాన్ని స్ప్రింటర్ అందించింది. మహిళల 100మీ. టీ35 విభాగం ఫైనల్‌లో స్ప్రింటర్‌ ప్రీతి పాల్‌ (Sprinter Avani Lekhara) మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.

Share post:

లేటెస్ట్