Heavy Rain: ఒక్కసారిగా కుంభవృష్టి.. అతలాకుతలమైన భాగ్యనగరం

ManaEnadu:హైదరాబాద్‌లో ఒక్కసారిగా కుంభవృష్టి(Heavy Rain) కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం దంచికొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపించాయి. డ్రైనేజీలు, నాలాలు(Drainages & Canals) పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో రోడ్ల(Roads)పైకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్(Heavy Traffic jam) అయ్యింది. ఉద్యోగులు ఆఫీసుల(Offices) నుంచి ఇంటికి వెళ్లే సమయం కాబట్టి సాధారణంగానే ట్రాఫిక్ సమస్య ఉంటుంది. కానీ భారీ వర్షాని(Rain)కి ఆ సమస్య మరింత తీవ్రంగా ఉంది. జనం గంటల తరబడి వర్షం, వరదలోనే చిక్కుకుపోయారు. స్పందించిన GHMC సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు(Traffic Police) తక్షణ చర్యలు చేపట్టారు.

ఈ ప్రాంతాల్లో కుండపోత వాన

నగరంలో కుండపోత వర్షం కురువటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షం ధాటికి లోతట్టు కాలనీలు జలమయం అయ్యాయి. బేగంపేట, పంజాగుట్ట, ఖైరతాబాద్(Khairatabad), లక్డీకాపూల్, నాంపల్లి, కోఠి, చైతన్యపురి, చార్మినార్(Charminar), అఫ్జల్ గంజ్, మెహిదీపట్నం, ట్యాంక్ బండ్(Tankband), బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండపూర్, గడ్చిబౌలి, బోరబండ, మేడ్చల్, జగద్గీరిగుట్ట, చింతల్, ఉప్పల్(Uppal), ఎల్బీనగర్, తర్నాక, సికింద్రాబాద్‌(Secunderabad)తోపాటు నగరంలో పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. అయితే ఉదయం నుంచి వాతావరణం సాధారణంగా ఉంది. అనుకోకుండా ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైంది. ఆ వెంటను భారీగా వర్షం కురిసింది. దీంతో నగరం తడిసిముద్దయ్యింది. మరోవైపు అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తం(Alert)గా ఉండాలని సూచించారు.

Share post:

లేటెస్ట్