కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయ్.. జారీ అప్పుడే!

Mana Enadu:తెలంగాణలో ఆరు గ్యారంటీలు అమలు చేయాలన్న లక్ష్యంతో రేవంత్ సర్కార్ ముందుకెళ్తోంది. అందులో భాగంగా ఎన్నికలకు ముందు ప్రకటించినట్లుగానే ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ వస్తోంది. ఉచిత బస్, ఆరోగ్య శ్రీ లిమిట్ పెంపు, 200యూనిట్ల ఫ్రీ కరెంట్ వంటి పథకాలను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. తాజాగా జరిగిన కేబినేట్ భేటీలోనూ మంత్రి మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అవేంటో ఓసారి చూద్దాం..

 

కొత్త రేషన్ కార్డులు

రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎన్నో కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. కొన్నేళ్లుగా కొత్త రేషన్ కార్డులు జారీ చేయకపోవడంతో జనం నిరాశతో ఉన్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నట్లు ప్రకటించి రాష్ట్ర ప్రజానీకానికి గుడ్ న్యూస్ చెప్పారు. ప్రజాపాలనలో దాదాపు 19 లక్షల మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారని, వీరందరికీ ఇంటింటి సర్వే ఉంటుందన్నారు. ఈ సర్వేలో అర్హులైన కుటుంబాల లెక్క తేలుతుందన్నారు. ఈ రిపోర్ట్ ఆధారంగానే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఉంటుందని స్పష్టం చేశారు. ‘‘కొత్త రేష‌న్ కార్డుల జారీకి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త రేష‌న్ కార్డుల జారీకి సంబంధించిన విధివిధానాల రూప‌క‌ల్ప‌న‌కు కేబినెట్ స‌బ్ క‌మిటీ ఏర్పాటు చేస్తాం. మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న రేష‌న్ కార్డుల జారీ విధివిధానాల స‌బ్ క‌మిటీ ఏర్పాటు అవుతుంది. రేష‌న్ కార్డు, ఆరోగ్య శ్రీ కార్డు విడివిడిగా ఇవ్వాల‌ని కేబినెట్లో నిర్ణయించాం’’ అని రేవంత్ క్లారిటీ ఇచ్చారు.

 ఇకపై భూమాత..!

 ‘‘మేం అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో కలిపేస్తాం. భూమాత పేరుతో కొత్త పోర్టల్‌ను తీసుకొస్తాం’’ ఎన్నికల ప్రచారంలో రేవంత్‌ రెడ్డి సహా ముఖ్యనేతలంతా చేసిన ప్రచారం ఇది. తాజాగా కేబినెట్ సమావేశంలో ధరణి పథకాన్ని ‘భూమాత’గా మార్చాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం తెలిపింది. పోర్టల్‌లో సుమారు 40-50 రకాల సమస్యలు ఉన్నాయని అధికారలు పేర్కొన్నారు. వీటిపై రైతులకు భరోసా కల్పించడంతోపాటు, ప్రభుత్వానికి వేగంగా సలహాలు ఇవ్వడంపై దృష్టి సారించినట్టు వివరించారు.

పలు కేబినెట్ నిర్ణయాలివే

– ఇండియా స్కిల్స్ వర్సిటీ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం.
– జాబ్ క్యాలెండర్ కు కేబినెట్ ఆమోదం.
– క్రీడాకారులు ఈషా సింగ్, నిఖత్ జరీన్, మహ్మద్ సిరాజ్‌కు HYDలో 600చ.గ ఇంటి స్థలంతోపాటు గ్రూప్-1 స్థాయి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయం.
– గౌరవెల్లి ప్రాజెక్ట్‌కు రూ.437 కోట్లు కేటాయింపు.
– కొత్త ఆరోగ్య శ్రీ కార్డులను జారీ చేయాలని నిర్ణయం.
– జీహెచ్ఎంసీ పరిధిని ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించే ముసాయిదా బిల్లుకు ఆమోదం.
– నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు తగిన చర్యలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది.

 

Related Posts

హైదరాబాద్ లో శానిట‌రీ ప్యాడ్ల ఫ్యాక్ట‌రీపై బీఐఎస్ దాడులు

హైదరాబాద్ నగరంలో ఐఎస్ఐ మార్కు (ISI Mark) లేని శానిట‌రీ ప్యాడ్లు స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ ఓ కేంద్రంపై బ్యూరో ఆఫ్ ఇండియ‌న్ స్టాండ‌ర్డ్స్ (BIS Raids), హైద‌రాబాద్ శాఖ అధికారులు దాడులు నిర్వ‌హించారు. కుషాయిగూడలోని ఓ కేంద్రంలో జ‌రిగిన సోదాల్లో అమ్మ‌కానికి…

TELANGANA : ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి.. ఇలా చెక్ చేస్కోండి

తెలంగాణ విద్యార్థులకు అలర్ట్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు (Telangana Inter Results 2025) విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు కార్యాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka),…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *