ManaEnadu:ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి ఈమధ్య తరచూ దిల్లీ పర్యటనలు సాగిస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, నామినేటెడ్ పదవులపై హైకమాండ్‌తో చర్చించేందుకు ఆయన హస్తినకు వెళ్తున్నారు. ఇటీవలే ఆయన దేశ రాజధానిలో పర్యటించి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీలను కలిశారు. కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవులపై చర్చించారు. కానీ ఆ చర్చలు ఓ కొలిక్కి రాలేదు.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇవాళ (గురువారం) రాత్రి 11 గంటలకు మరోసారి దిల్లీ వెళ్లనున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ కూడా సీఎం వెంట వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇవాళ దిల్లీ చేరుకోనున్న ఆయన శుక్రవారం రోజున పార్టీ పెద్దలతో సమావేశం కానున్నారు.
ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ అంశాలపై హైకమాండ్‌తో రేవంత్ రెడ్డి చర్చలు జరపనున్నట్లు తెలిసింది. మరోవైపు తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ మను సింఘ్వీ ఏకగ్రీవ ఎంపిక అంశాలపై చర్చించనున్నారు. అదే విధంగా సచివాలయంలో ఏర్పాటు చేస్తున్న దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ విగ్రహావిష్కరణకు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకలను ఆహ్వానిస్తారు.
ఇంకోవైపు రూ.2లక్షల రుణమాఫీ చేసిన సందర్భంగా వరంగల్‌లో నిర్వహించనున్న కృతజ్ఞత సభకు రాహుల్ గాంధీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించనున్నారు. రాష్ట్రంలో గడిచిన ఎనిమిది నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, ఆరు గ్యారంటీల అమలు అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Rashmika Mandanna: ‘ఛావా’ ప్రమోషన్స్.. రష్మిక కామెంట్స్‌పై కన్నడిగుల ఫైర్
ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో నేషన్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) జోరు కొనసాగుతోంది. టాలీవుడ్(Tollywood), బాలీవుడ్(Bollywood) అనే తేడా లేకుండా వరుసబెట్టి ఆఫర్లు సొంతం చేసుకుంటోంది. దీంతో దక్షిణాది ఇండస్ట్రీలలో ఆమె పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఇటీవల యానిమల్(Animal), పుష్ప-2(Pushpa2)తో సూపర్…