ManaEnadu:అదానీ వ్యవహారాన్ని చట్టసభల్లో రాహుల్ గాంధీ బయటపెట్టారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ వ్యవహారంపై జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలన్న డిమాండ్‌తో ఈడీ కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. దేశానికి రూ.183 లక్షల కోట్ల అప్పులున్నాయని తెలిపారు. 16 మంది ప్రధానులు చేసిన అప్పుల కంటే నరేంద్ర మోదీ రెండింతలు ఎక్కువ చేశారని ఆరోపించారు. మోదీ తన పరివారాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. దేశాన్ని మోదీ, అమిత్‌షా, అదానీ, అంబానీ చెరబట్టారని దుయ్యబట్టారు.
హైదరాబాద్ ఈడీ కార్యాలయం వద్ద రాష్ట్ర కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలు పాల్గొన్నారు. వర్సిటీలు, ప్రాజెక్టులను మొదలుపెట్టిన దార్శనిక ప్రధాని నెహ్రూ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇందిరాగాంధీ భూసంస్కరణలు ప్రవేశపెట్టి బలహీనవర్గాలకు భూములు పంచారని తెలిపారు. రాజీవ్‌గాంధీ తెచ్చిన సాంకేతిక విప్లవం వల్లే ఐటీ అభివృద్ధి సాధ్యమైందని గుర్తు చేశారు. పీవీ నరసింహారావు ఆర్థికసంస్కరణలు తెచ్చి ప్రపంచానికే మార్గదర్శకం చేశారని పేర్కొన్నారు.
మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. దేశ సంపదను అదానీ దోచుకున్నారని ఆరోపించారు. అదానీ దోపిడీపై రాహుల్‌గాంధీ పార్లమెంటులో ప్రశ్నించారని గుర్తు చేశారు. దేశ సంపదను కాపాడేందుకు కాంగ్రెస్ పోరాడుతుందని.. అన్ని ఈడీ కార్యాలయాల ముందు నిరసనలు చేస్తున్నామని తెలిపారు. అదానీ దోపిడీ చేసిన సంపదను ప్రజలకు చేరవేసేంతవరకూ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. దేశ ప్రజల ఆస్తులు కాపాడేందుకే ఈడీ కార్యాలయం ముందు నిరసనలు చేస్తున్నామని వెల్లడించారు. సెబీ ఛైర్మన్ అక్రమాలపై జేపీసీ వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేశారు.
Rashmika Mandanna: ‘ఛావా’ ప్రమోషన్స్.. రష్మిక కామెంట్స్‌పై కన్నడిగుల ఫైర్
ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో నేషన్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) జోరు కొనసాగుతోంది. టాలీవుడ్(Tollywood), బాలీవుడ్(Bollywood) అనే తేడా లేకుండా వరుసబెట్టి ఆఫర్లు సొంతం చేసుకుంటోంది. దీంతో దక్షిణాది ఇండస్ట్రీలలో ఆమె పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఇటీవల యానిమల్(Animal), పుష్ప-2(Pushpa2)తో సూపర్…