CM Revanth Review on Musi Development : మూసీ నది ప్రక్షాళనను వీలైనంత త్వరగా ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నగరంలోని చారిత్రక కట్టడాలను కలుపుతూ వెళ్లేలా మూసీ అభివృద్ధికి ప్రణాళిక సిద్దం చేయాలన్నారు.
హైదరాబాద్‌లోని చారిత్రక కట్టడాలన్నీ కలుపతూ వెళ్లేలా మూసీ అభివృద్ధికి ప్రణాళిక చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. పెట్టుబడులని ఆకర్షించే స్థాయిలో అభివృద్ధి చేయాలని పర్యాటకంగా, ఆహ్లాదకరమైన ఉద్యానంగా మార్చాలని నిర్దేశించారు. మూసీ నది పరీవాహక అభివృద్ధిపై హైదరాబాద్ నానక్‌రాంగూడ హెచ్ఎండీఏ(HMDA) కార్యాలయంలో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో హెచ్ఎండీఏ(HMDA) ఉన్నతాధికారులు దానకిశోర్, ఆమ్రపాలి తదితరులు పాల్గొన్నారు.