Mana Enadu: కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టగానే ప్రజలకు ఇచ్చిన హమీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా పర్యటనలో ఆయన రెండు లక్షల రుణమాఫీ కీలక ప్రకటన చేశారు. లక్ష, లక్షన్నార వరకు రైతు రుణమాఫీ పూర్తి చేశామని చెప్పారు. త్వరలోనే రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన ఉత్తర్వులు అందిస్తున్నామని వెల్లడించారు.
మరోవైపు ప్రకృతి వైపరిత్యాల కారణంగా విద్యుత్ సరాఫరాలో అంతరాయం జరిగితే బీఆర్ఎస్ రాజకీయ విమర్శలు చేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కారు రెప్పపాటు కూడా కరెంటు సరాఫరా అంతరాయం కల్గించడం లేదన్నారు. గత ప్రభుత్వం ట్రిప్‌లు పేరుతో గంటల కొద్ది విద్యుత్ సరాఫరా చేయలేదని ఆరోపించారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్ధరాత్రి సమయంలో పిర్యాదు వచ్చినా కరెంటు సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నామన్నారు. క్షేత్రస్థాయిలో కరెంటు సిబ్బంది ప్రాణాలకు తెగించి పని చేస్తున్నారని అభినందించారు.
కరెంటు వాడకం పెరిగినప్పటికీ కరెంటును తెప్పించి ప్రజలకు సరాఫరా చేస్తున్నామని చెప్పారు. రాబోయే 10 ఏళ్లకు కూడా అవసరమయ్యే కరెంటుని ఉత్పత్తి చేస్తున్నామని వివరించారు.పొల్యూషన్ లేని విద్యుత్ ఉత్పాదనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి 11పెట్టిందని పేర్కొన్నారు.
త్వరలోనే కొత్త రేషన్ కార్డులు:
దేశ చరిత్రలోనే అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేసి రికార్డు నమోదు చేయబోతున్నామని స్పష్టం చేశారు. అంతేగాకుండా మరోవైపు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు జారీ చేసే ప్రక్రీయ ప్రభుత్వం ప్రారంభించబోతుందని కీలక ప్రకటన చేశారు.