Telangana Govt: రూ.2లక్షల రుణమాఫీపై వెనక్కి తగ్గేదేలేదు: డిప్యూటీ సీఎం

ManaEnadu: అన్నదాతల(Formers)కు తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) తీపి కబురు చెప్పింది. రుణమాఫీ(Loan waiver)పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) కీలక ప్రకటన చేశారు. రూ. 2 లక్షలకు పైబడిన రుణాల మాఫీపై ప్రభుత్వం ఆలోచన చేపట్టిందని తెలిపారు. రైతులకు ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేయడంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు భట్టి విక్రమార్క. రెండు లక్షలకు పైగా రుణమాఫీపై ఎలాంటి హామీ ఇవ్వకపోయినప్పటికీ రెండు లక్షలకు పైగా ఉన్న పంట రుణాలను మాఫీ చేయాలని ఆలోచిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే రూ. రెండు లక్షల రుణమాఫీ కింద రూ.18 వేల కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామని పెద్దపల్లి జిల్లా పర్యటన సందర్భంగా భట్టి వివరించారు. గత BRS ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిందని ఆయన ఆరోపించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో కలిసి పాల్గొన్న భట్టి నందిమేడారం(Nandi medaram) పంప్ హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ప్రభుత్వం సహిస్తూ ఊరుకోదని ఆయన స్పష్టం చేశారు. బాధ్యత గత ఎమ్మెల్యేలు నడిరోడ్డులో తన్నుకోవడం బాధ కలిగిస్తోందన్న ఆయన.. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు తగదని అన్నారు.

 ఉనికి కోసమే బీజేపీ డ్రామాలు: భట్టి

గతంలో BRS వ్యవహరించినట్లు తాము ప్రవర్తించమని భట్ట నొక్కి చెప్పారు. ప్రతిపక్ష నేత అంటే మాకు గౌరవం ఉందన్నారు.‌ అసెంబ్లీ(Assembly)లో అధికార పార్టీ ఎవరో, ప్రతిపక్ష పార్టీ ఎవరో స్పీకర్(Speaker) వెల్లడించారని తెలిపారు. శాంతిభద్రతలు కాపాడడంలో తమ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇద్దరు MLAల తగాదా వెనుక కాంగ్రెస్ పెద్ద తలకాయ ఉందని BJP ఆరోపించడం అర్థరహితమన్నారు. బీజేపీ ఉనికి కోసం రాజకీయ డ్రామాలు ఆడుతుందని మండిపడ్డారు.ఇక విద్యుత్ రంగంలో దేశానికే ఆదర్శంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని డిప్యూటీ సీఎం తెలిపారు. నందిమేడారం, కటికనపల్లి గ్రామాల్లో రెండు 33/11KV సబ్ స్టేషన్ల పనులకు శంకుస్థాపన చేశారు. 2030నాటికి గ్రీన్ పవర్, సోలార్ పవర్(Solar power), ఫ్లోటింగ్ సోలార్, పంప్ స్టోరేజ్ ఎనర్జీ(Storage Energy) మొదలగు రంగాలలో దాదాపు 20 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

 పైలట్ ప్రాజెక్టుగా ఆ గ్రామాలు

పైలట్ ప్రాజెక్టు(A pilot project) కింద కొన్ని గ్రామాలను ఎంపిక చేసి, ఆ గ్రామాలలోని రైతుల మోటార్లకు పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో సోలార్ పంపు సెట్ల(Solar pump sets)ను ఏర్పాటు చేయబోతున్నామని డిప్యూటీ సీఎం భట్టి ప్రకటించారు. రైతులకు పంటలతో పాటు విద్యుత్తుతో కూడా ఆదాయం సమకూరే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. దశాబ్ది కాలం పైగా పెండింగ్లో ఉన్న ఎల్లంపల్లి నిర్వాసితులకు రూ.18 కోట్ల విలువగల చెక్కులను అందజేశారు. పదేళ్లుగా పరిష్కారం కాని సమస్య పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం పరిష్కరించడం సంతోషంగా ఉందని అన్నారు భట్టి విక్రమార్క. ప్రాజెక్టుల నిర్మాణానికి భూములు ఇచ్చిన భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత కల్పించిందని, రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఉన్న భూసేకరణ నిధులను చెల్లించడానికి ప్రాధాన్యత కల్పిస్తున్నామని అన్నారు.

Share post:

లేటెస్ట్