Khammam: డిప్యూటీ సీఎం తాలుకాలో..రూ2ల రుణమాఫీ

ManaEnadu:రుణమాఫీ అమలు విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకుంటున్నాయి. మరోవైపు ఓ రైతుకు సీఎం రేవంత్​రెడ్డి(CM Reventh Reddy) పేరుతో రూ.2అప్పు మాఫీ అయిందనే సందేశం రావడంతో ఆశ్చరానికి గురయ్యాడు. ఇప్పుడు ఈ వార్త సోషల్​ మీడియాలో  చక్కెర్లు కొడుతుందిజ

ఖమ్మం (Khammam)జిల్లా చింతకాని మండల పరిధిలోని నాగులవంచకు (Nagulavancha)చెందిన రైతు అంబటి రాజేష్‌ గ్రామంలోని సొసైటీ ద్వారా 2022లో రూ.1.10లక్షల అప్పు తీసుకున్నాడు. ఏడాది తర్వాత 2023 అక్టోబరులో ఆ రుణాన్ని వడ్డీతో సహా చెల్లించాడు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక రుణమాఫీ(Runa Mafi) అమలు ప్రకటన చేయగానే.. తాను కట్టిన డబ్బులు తిరిగి వెనక్కి వస్తాయని ఆ రైతు ఆనందపడ్డాడు.

చివరికి రుణమాఫీ జాబితాలో తన పేరు ఉండడంతో సంబురపడ్డాడు. కానీ, ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం 2023 డిసెంబరు 9 నాటికి అప్పు ఉన్న రైతుకు మాత్రమే రుణమాఫీ వర్తింపజేశారు. రాజేష్‌ రుణ ఖాతాలో రూ.2 అప్పుగా చూపించడంతో.. ఆ మేరకు మాఫీ చేస్తున్నట్లు అతడి ఫోన్‌కు సమాచారం అందింది. ‘‘రుణమాఫీ జాబితాలో నా పేరు చూసుకుని ఎంతో సంబరపడ్డా. ఆ ఆనందం క్షణాల్లోనే ఆవిరైంది’’అని ఆ రైతు ఆవేదన వెల్లబుచ్చకున్నాడు.

 

Share post:

లేటెస్ట్