Telangana Highways: తెలంగాణలో ఆ 6 హైవేలకు మహర్దశ

Mana Enadu:కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ సీఎం, మంత్రుల బృదం ఈ రోజు భేటీ అయ్యింది. తెలంగాణలో పలు జాతీయ రహదారుల అభివృద్ధి, అనుమతుల కోసం గడ్కరీకి వినతి పత్రం అందించగా ఆయన సానుకూలంగా సంబంధించి.. వెంటనే ఆదేశాలు జారీ చేశారు.

CM ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ వెంకటస్వామి తదితరులు ఈ రోజు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారితో సమావేశమయ్యారు. తెలంగాణలో పలు జాతీయ రహదారుల నిర్మాణం, అభివృద్ధి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఈ 6 కీలక అంశాలపై చర్చించారు1. రాష్ట్ర ప్రభుత్వం వినతి మేరకు తెలంగాణలో నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారులకు అడ్డంకిగా మారిన అటవీ అనుమతుల కోసం జూలై నెలలో హైదరాబాద్ కు NH, NHAI, MoRTH అధికారుల బృందం పంపించడానికి నితిన్ గడ్కరీ అంగీకరించినట్లు మంత్రులు తెలిపారు.

2. హైదరాబాద్ – విజయవాడ NH-65 రోడ్డును ఆరు లేన్లుగా నిర్మించేందుకు.. వెంటనే BOT కన్సెషనరీ M/s GMR సంస్థ వివాదాన్ని పరిష్కరించి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మించాలని గడ్కరీకి వివరించగా.. ఆయన తక్షణం స్పందించి.. వచ్చే నెలలో టెండర్లు పిలుస్తామని.. రాబోయే మూడు నెలల్లో పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చినట్లు మంత్రులు తెలిపారు.

3. ఉప్పల్ – ఘట్ కేసర్ ఫ్లైఓవర్ పనులు గత 4 సంవత్సరాలుగా నత్తనడకన సాగుతున్న విషయం శ్రీ నితిన్ గడ్కరీదృష్టికి మంత్రులు తీసుకెళ్లగా.. ఆయన తక్షణం స్పందించి.. ఈ కాంట్రాక్ట్ ను ఫోర్ క్లోస్ చేసి కొత్త టెండర్లు పిలిచి పనులు పూర్తిచేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారని మంత్రులు వెల్లడించారు.

4. ఇక రాష్ట్ర భవిష్యత్తును మార్చే రీజినల్ రింగ్ రోడ్డు (RRR) కోసం ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేస్తానని గత సమావేశంలో చెప్పినట్టుగానే.. ఈ రోజు కూడా ప్రత్యేక చొరవ తీసుకుని సమీక్షిస్తానని మంత్రి నితిన్ గడ్కరీ గారు చెప్పారని మంత్రులు తెలిపారు.

5. NH-765 (హైదరాబాద్ – కల్వకుర్తి) రోడ్డును నాలుగు లేన్లుగా నిర్మించేందుకు కావాల్సిన డీపీఆర్ (DPR)ను త్వరితగతిన పూర్తిచేయాలని కోరగా… స్పందించిన గడ్కరీ DPR ను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

6. NH-163 (హైదరాబాద్ – మన్నెగూడ) రోడ్డుకు ఉన్న NGT సంబంధిత సమస్యకు సత్వర పరిష్కారాన్ని కనుగొని, ఏడాదికి పైగా పెండింగ్‌లో ఉన్న నాలుగు లేన్ల నిర్మాణ పనులను ప్రారంభించాలని కోరగా.. ఆయన అత్యంత సానుకూలంగా స్పందించారని మంత్రులు వెల్లడించారు.

 

Share post:

లేటెస్ట్