ManaEnadu:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లోని ఆడబిడ్డల వివాహానికి సహకారం అందించేదుకు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. గత కేసీఆర్ సర్కార్ ప్రారంభించిన ఈ పథకాన్ని ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఈ పథకం కింద పెళ్లయిన ఆడబిడ్డలకు ప్రభుత్వం తరఫున 1,00,116 రూపాయలు అందుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా కాంగ్రెస్ సర్కార్.. బడ్జెట్ కేటాయింపుల నుంచి రూ.1,450 కోట్లు కళ్యాణ లక్ష్మీ పథకం కోసం విడుదల చేసింది. కొన్ని నెలలుగా పెండింగ్లో ఉన్న లబ్దిదారుల దరఖాస్తులకు మోక్షం లభించినట్లయింది. మరి, ఈ పథకానికి ఈజీగా ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
ఈ పథకానికి ఉండాల్సిన అర్హతలు ఇవే
దీనికి దరఖాస్తు చేసుకోవాలంటే శాశ్వతంగా తెలంగాణ వాసులై ఉండాలి.
వధువుకు కనీసం 18 సంవత్సరాలు, వరుడు కనీసం 21 ఏళ్లపైన ఉండాలి.
కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.2 లక్షల లోపు ఉండాలి.
కళ్యాణ లక్ష్మీ అప్లై చేసుకోవడానకి కావాల్సిన డాక్యుమెంట్లి ఇవే..
వధువు ఫొటో, బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు
వధువు, ఆమె తల్లి బ్యాంకు పాస్‌బుక్ కాపీ
ఆన్లైన్లో స్వయంగా మీరే అప్లై చేసుకోవచ్చు. లేదంటే మీ సేవాలోనైనా చేసుకోవచ్చు.
ఇలా ఈజీగా అప్లై చేసుకోండి
ముందుగా telanganaepass.cgg.gov.in వెబ్ సైట్లోకి వెళ్లాలి.
హోమ్ పేజీలో కిందకు స్క్రోల్ చేస్తే “కళ్యాణ లక్ష్మీ” ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి.
అప్పుడు మరో పేజీ ఓపెన్ అవుతుంది. అందులో కళ్యాణ లక్ష్మీ రిజిస్ట్రేషన్ ఆప్షన్స్ ఉంటాయి.
“రిజిస్ట్రేషన్” అనే ఆప్షన్ను సెలక్ట్ చేసి వధువు సమాచారం కులం, ఆదాయం, చిరునామా, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఎంటర్ చేయండి.
వరుడి వయస్సు ఎంటర్ చేసి అక్కడ అడిగిన మరికొంత సమాచారం యాడ్ చేయండి.
చివరలో అన్ని డాక్యుమెంట్లకు సంబంధించిన స్కాన్ కాపీని అప్ లోడ్ చేసి ఒకసారి వివరాలన్నీ చెక్ చేసుకుని “Submit” బటన్ క్లిక్ చేయండి.