CM Revanth : ఖమ్మం వరదలకు కారణం ఆక్రమణలే : సీఎం రేవంత్

ManaEnadu:ఖమ్మంలో ఆక్రమణల వల్ల వరదలు (Telangana FLoods) వచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మున్నేరు రిటైనింగ్ వాల్ ఎత్తు పెంపుపై ఇంజినీర్లతో చర్చిస్తామని తెలిపారు. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ద్వారా గుర్తించి ఆక్రమణలు తొలగిస్తామని చెప్పారు. 75 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 42 సెం.మీ వర్షం (Khammam Rain) పడిందని మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం పేర్కొన్నారు.

‘ప్రభుత్వ ముందుచూపు వల్లే ప్రాణనష్టం తగ్గింది. వరదల (Khammam FLoods)పై హరీశ్‌రావు ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. బీఆర్‌ఎస్‌ నేత పువ్వాడ ఆక్రమణలపై హరీశ్‌ స్పందించాలి. ఆక్రమించిన స్థలంలో పువ్వాడ ఆస్పత్రి కట్టారు. ఆక్రమణలను తొలగించాలని పువ్వాడకు హరీశ్‌రావు చెప్పాలి. ఆక్రమణల తొలగింపుపై బీఆర్‌ఎస్‌ నేతలు ఆదర్శంగా నిలవాలి.’ అని రేవంత్ సూచించారు.

వరద సాయం కోసం కేంద్రానికి లేఖ రాశామని సీఎం రేవంత్ (CM Revanth) అన్నారు. కేంద్రాన్ని రూ.2 వేల కోట్ల తక్షణ సాయం కోరామని చెప్పారు. జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధానికి లేఖ రాశామని, అయినా కేంద్రం (Central Govt) నుంచి ఇప్పటివరకు స్పందన లేదని తెలిపారు. ప్రధాని సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. వరదల వల్ల రూ.5,438 కోట్ల నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేశామని వెల్లడించారు.

‘ప్రస్తుతం హైడ్రా (Hydra)ను జిల్లాలకు విస్తరించే యోచన లేదు. నాటి కమీషన్ కాకతీయ వల్లే చెరువులన్నీ కట్టలు తెగాయి:. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఇవ్వాలని ఈటల అంటున్నారు. కేంద్రం నుంచి రూ.25 లక్షలు ఇప్పిస్తే రాష్ట్రం తరఫున అంతే మొత్తం ఇస్తాం. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం లేదనే భావిస్తున్నాం. ప్రతిపక్ష నేతకు బాధ్యత లేనందునే ఫాంహౌస్‌కు పరిమితమయ్యారు. కేసీఆర్‌ (KCR)ను ప్రజలు చూసి చాలా రోజులైంది.. ఆయన ప్రజల్లో లేరు.’ అని రేవంత్ అన్నారు.

Share post:

లేటెస్ట్