ManaEnadu:రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సాగిన తెలంగాణ సీఎం రేవంత్(Cm Revanth) రెడ్డి అమెరికా పర్యటన ముగిసింది. ఈ టూర్‌లో తెలంగాణ ప్రభుత్వం(Telangana Government)తో దాదాపు రూ.31,532 కోట్ల పెట్టుబడులను ఆకర్షించినట్లు సీఎంఓ(CMO) కార్యాలయం పేర్కొంది. దీంతో పాటు ఈ ఏడాది దాదాపు 30,750 కొత్త ఉద్యోగాలను కల్పించేలా 19 కంపెనీలతో సీఎం సంప్రదింపులు జరిపారని, పలు కంపెనీలతో ఒప్పందాలు కూడా చేసుకున్నారని తెలిపింది. కాగా సీఎం దాదాపు తొమ్మిది రోజులు పాటు అమెరికాలోని వివిధ పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు.
19 కంపెనీలతో అవగాహన ఒప్పందాలు
ముఖ్యంగా అమెరికా(America) వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ తెలంగాణను ఫ్యూచర్ స్టేట్‌గా ప్రకటించారు. హైదరాబాద్ 4.0 సిటీగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న వివిధ ప్రాజెక్టులకు భారీ స్పందన లభించిందని అధికారులు తెలిపారు. ఈ పర్యటనలో దాదాపు 19 కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. సీఎంతోపాటు మంత్రి శ్రీధర్ బాబు, పలువురు ప్రభుత్వ అధికారుల బృందం ఈ నెల 3న అమెరికా పర్యటనకు బయల్దేరింది. సీఎం సారథ్యంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం అమెరికాలో దాదాపు యాభైకి పైగా బిజినెస్ మీటింగులు, మూడు రౌండ్ మీటింగ్లుల్లో పాల్గొంది.
కీలక ఒప్పందాలివే..
* అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI), ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రిక్ వాహనాలు, డేటా సెంటర్లు, ఐటీ(IT), ఎలక్ట్రానిక్ రంగాల్లో పలు కంపెనీలతో సీఎం ఒప్పందం.
* కాగ్నిజెంట్, చార్లెస్ స్క్వాబ్, ఆర్సీసియం కార్నింగ్, ఆమ్జెన్, జొయిటిస్, హెచ్సీఏ హెల్త్ కేర్, వివింట్ ఫార్మా, థర్మో ఫిసర్, ఆరమ్ ఈక్విటీ, ట్రైజిన్ టెక్నాలజీస్, మోనార్క్ ట్రాక్టర్ కంపెనీలు రాష్ట్రంలో విస్తరణకు, కొత్త కేంద్రాలు నెలకొల్పేందుకు తమ సంసిద్ధతను వ్యక్తం చేశాయి.
* హైదరాబాద్‌లో తమ డేటా సెంటర్ విస్తరణకు అమెజాన్ తీసుకున్న నిర్ణయం ఈ పర్యటనలో చెప్పకోదగ్గ మైలు రాయిగా నిలిచింది. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి బృందం ఈ పర్యటనలో యాపిల్, గూగుల్, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలతో, ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతోనూ చర్చలు జరిపింది.
దక్షిణ కొరియాకు సీఎం రేవంత్
సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో డ్రైవర్ లెస్ కారులో ప్రయాణించారు. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో వేమో అనే డ్రైవర్ లెస్ కారులో ప్రయాణించి దాని విశేషాల గురించి సంస్థ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సీఎంతోపాటు మంత్రి శ్రీధర్ బాబు కూడా అందులో ప్రయాణించారు. అనంతరం సీఎం అమెరికా టూర్ ముగించుకుని అక్కడి నుంచే నేరుగా దక్షిణ కొరియా బయల్దేరి వెళ్లారు. ఆయనతోపాటు మంత్రులు, అధికారులు కూడా ఉన్నారు. దక్షిణ కొరియాలో సీఎం మూడు రోజులపాటు పర్యటించనున్నారు. ఆ తర్వాత ఒక రోజు పర్యటనకు సింగపూర్ వెళ్లనున్నారు. ఈ నెల 14న రేవంత్ టీమ్ రాష్ట్రంలో అడుగుపెట్టనుంది.