Mana Enadu: ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. ఓటు(Vote) అనే రెండక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఓటరు నమోదు కావడానికి తెలంగాణ ఎన్నికల కమిషన్ యువతతో పాటు పాత ఓటర్లకు మరో అవకాశం కల్పించింది. ఈ మేరకు ఎన్నికల ప్రధాన అధికారి వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(Special Drive) కార్యక్రమం ఆగస్టు 20 నుంచి ప్రారంభమైందని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి (Chief Electoral Officer Telangana) సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. రాబోయే నాలుగు నెలలు ఈ కార్యక్రమం జరుగుతుందని ఆయన తెలిపారు. ఇప్పటికే 18 ఏళ్లు నిండిన వారితోపాటు జనవరి 1, 2025 నాటి 18 ఏళ్లు నిండబోయే వారందరు ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవచ్చని చెప్పారు. అర్హులందరూ Voters.eci.gov.in / Voter Helpline Mobile App ద్వారా నమోదు చేసుకోవచ్చిని సీఈవో పేర్కొన్నారు.
ఏడాదిలో నాలుగు అర్హత తేదీలు..
ఓటరుగా నమోదుకై ఏడాదిలో నాలుగు అర్హత తేదీలు ఉంటాయని.. జవనరి 1, ఏప్రిల్ 1, జులై 1, అక్టోబర్ 1 అని తెలిపారు. అక్టోబర్ 28 వరకు సవరణ కార్యక్రమం ఉంటుందన్నారు. 119 నియోజకవర్గాలకు 119 EROలు ఉంటారని చెప్పారు. BLOలు ఇంటింటికీ వెళ్లి సవరణలు చేస్తారని వివరించారు. ఒకే వ్యక్తికి నాలుగైదు ఓటరు కార్డులున్నాయని, డ్రాప్ట్ ఎలక్ట్రోల్ రోల్(Draft Electrol Roll) జరుగుతుందని అన్నారు. వాటిని రాజకీయ పార్టీలకి అందిస్తామచి చెప్పారు. డ్రాప్ట్ ఎలక్ట్రోల్ రోల్ వాల్లకి ఇప్పటికే శిక్షణ పూర్తయిందని తెలిపారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,33,27,304 మంది ఓటర్లు ఉన్నట్లు సీఈవో తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు 8 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు ఆయన చెప్పారు. వాటిలో 2.45 లక్షల అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అటు ఓటర్ కార్డు(Voter Card)కు ఆధార్ కార్డు(Aadhar) లింక్ ప్రక్రియ 60శాతం పూర్తయిందని సీఈవో వివరించారు. ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైనదని, యువత(Youth) విధిగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.