హైదరాబాద్‌లోని మొయినాబాద్ ఐఐటీఏలో సుమారు ఎనిమిది నెలల పాటు శిక్షణ పూర్తిచేసుకున్న జాగిలం దియాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కేటాయించడంపై ఎస్పీ రోహిత్‌రాజు హర్షం వ్యక్తం చేశారు.
దియా పేలుడు పదార్థాలను గుర్తించడంలో దిట్ట. ప్రత్యేకంగా శిక్షణ పొందిన జాగిలాన్ని జిల్లాకు కేటాయించారు.
జాగిలం హ్యాండ్లరుగా వ్యవహరిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ మహేందర్, ఇతర డాగ్‌స్క్వాడ్ అధికారులు, సిబ్బందికి ఎస్పీ పలు సూచనలు ఇచ్చారు. ప్రస్తుతం పోలీస్ శాఖలో పదకొండు జాగిలాలు సేవలందిస్తున్నాయి. వాటి వివరాలను అధికారులను అడిగి ఎస్పీ తెలుసుకున్నారు.
జాగిలాల రక్షణ, వసతి ఏర్పాట్లలో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.