Mana Enadu: సోషల్ మీడియా(Social Media) మోజులో పడిన నేటి యువత రోజురోజుకు బరిదెగిస్తున్నారు. ఇన్‌స్టా రీల్స్(Insta reels), యూట్యూబ్ షాట్స్(Youtube shorts)పై పిచ్చి పీక్స్‌కు పోయి లైకుల కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు కొందరు యువత(Youth). రోజురోజుకీ ఈ పిచ్చి వ్యసనంగా మారి తామేం చేస్తున్నామో, అది ఎంతటి ప్రమాదానికి దారి తీస్తుందోననే స్పృహ లేకుండా రీల్స్ చేయడంలో మునిగిపోతున్నారు. ఇలాంటివి చేస్తూ కొన్ని సందర్భాల్లో ప్రాణాలే కోల్పోతున్నారు. కన్నవాళ్లకు కడుపుకోత మిగులుస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి ఉత్తరాఖండ్(Uttharakhand)లోని
హరిద్వార్(Haridwar)లో చోటు చేసుకుంది. సదరు యువతి చేసిన పిచ్చి పని వీడియో సోషల్ మీడియాలో వైరల్(Viral)గా మారింది. దీనిపై నెటిజన్లు(Netizens) రకరకాలుగా కామెంట్స్(Comments) చేస్తున్నారు. ఇంతకీ ఏమైందో తెలుసుకుందాం పదండీ..
ఇంతకీ ఏం జరిగిందంటే..
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ క్షేత్రంలోని గంగానదిలో ఓ యువతి(Girl) స్నానమాచరించింది. అంతలోనే అక్కడ నది ఒడ్డున ఏర్పాటు చేసిన శివలింగాన్ని చూసి అటుగా వెళ్లింది. శివలింగం దగ్గరకు వెళ్లి బాధపడినట్లుగా చేస్తూ.. కన్నీటితో ఆ దేవదేవుడిని పూజిస్తున్నట్లు నటించింది.
అనంతరం నదిలో భద్రత కోసం ఏర్పాటు చేసిన కర్రల రైలింగ్(Railing)పై నడుచుకుంటూ వెళ్లేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో ఆ యువతి అదుపు తప్పి గంగానది(Ganga River)లో పడిపోయింది. ఆక్రమంలో ఆమెకు గాయాలూ అయ్యాయి. అనంతరం ఆమె నది ప్రవాహంలో కొట్టుకుపోయింది. అది అక్కడున్న వారు గమనించి కాపాడేందుకు నదిలోకి దూకేలోపే ఆమె చాలా దూరం కొట్టుకుపోయింది. అదృష్టవశాత్తూ రైలింగ్ రాడ్ పట్టుకుని ఒడ్డుకు చేరుకోగలిగిందా యువతి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతోంది.
रील की शौक़ीन इस लड़की को थोड़ी सजा देकर बहुत साफ भगवान महादेव ने बचा लिया। नहीं तो ये तो …..
वीडियो हरिद्वार के विष्णु घाट का। भगवान महादेव को भी इनका रील बनाना पसंद नहीं आया। pic.twitter.com/O3kATu4mhP
— Shubham Shukla (@ShubhamShuklaMP) September 11, 2024
పిచ్చి పనులతో ప్రాణాలు కోల్పోవద్దు..
అయితే యువతి రీల్స్(Reels) ఘటన వీడియో వైరల్ అవడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. పిచ్చి పనులతో ప్రాణాలు కోల్పోవద్దంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో ఆమె చేసిన తెలివి తక్కువ పనికి ఆ మహాశివుడే తగిన గుణపాఠం చెప్పాడని అన్నారు. ఇంకొందరు సోషల్ మీడియాలో ఫేమ్, వ్యూస్ కోసం ఇలాంటి వారు దేవుడిని కూడా వదిలిపెట్టడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఇప్పటికైనా రీల్స్ చేసే వారు ఇలా ప్రాణాలను ఫణంగా పెట్టి చేయడం మానుకోవాలని మరికొందరు హితవు పలుకుతున్నారు.