విజయవాడ To హైదరాబాద్‌.. రైళ్ల రాకపోకలు షురూ.. బస్సు టికెట్లపై 10% డిస్కౌంట్

ManaEnadu:భారీ వర్షాల వల్ల సంభవించిన వరదల (Floods)తో చాలా ప్రాంతాల మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మధ్య ముఖ్యమైన జాతీయ రహదారి హైదరాబాద్ విజయవాడ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఓవైపు రైలు (Train) మార్గంలో, మరోవైపు బస్సు మార్గంలోనూ ఇబ్బందులు ఏర్పడ్డాయి. అయితే తాజాగా రైల్వే ప్రయాణికులకు అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు.

భారీ వర్షాలు, వరదల వల్ల రైల్వే ట్రాక్‌ (Railway Track) దెబ్బతినడంతో విజయవాడ-హైదరాబాద్‌ మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. రైల్వే ట్రాక్‌ను పురనద్ధరించేందుకు గత రెండ్రోజులుగా సిబ్బంది అహర్నిషలు శ్రమించారు. ఇక తాజాగా వారి శ్రమ ఫలించడంతో ఈ మార్గంలో రైలు సర్వీసులను పునరుద్ధరించారు. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం సమీపంలో వద్ద ట్రాక్‌ మరమ్మతులు పూర్తి కావడంతో రైలు సర్వీసులు (Train Services) ప్రారంభమైనట్లు రైల్వే అధికారులు తెలిపారు.

హైదరాబాద్‌ వెళ్లే రైళ్లను వరంగల్‌ మీదుగా పంపిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ట్రయల్‌ రన్‌లో భాగంగా విజయవాడ నుంచి గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ (Golconda Express Train)ను తొలుత పంపినట్లు వెల్లడించారు. ఆ రైలు విజయవాడ, గుంటూరు, వరంగల్‌ మీదుగా హైదరాబాద్‌ వెళ్లిందని.. అప్‌లైన్‌లో సర్వీసులను పునరుద్ధరించామని.. డౌన్‌లైన్‌లో బుధవారం అర్ధరాత్రికి పనులు పూర్తిచేస్తామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వివరించారు.

మరోవైపు వరదల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) ఓ గుడ్ న్యూస్ చెప్పింది. రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులు గత కొన్ని రోజులుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌-విజయవాడ మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికుల విషయంలో తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్‌ ధరలో 10 శాతం రాయితీ (TGSRTC Flood Discount) కల్పిస్తోంది. రాజధాని, ఏసీ, సూపర్‌ లగ్జరీ బస్సులలో ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. ముందస్తు రిజర్వేషన్ కోసం https://www.tgsrtcbus.inలో టికెట్లు బుక్‌ చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

Share post:

లేటెస్ట్