మొయిజ్జు భారత్ పర్యటనకు ముందు.. మోదీపై నోరు పారేసుకున్న మాల్దీవుల మంత్రుల రాజీనామా

ManaEnadu:గతేడాది నవంబర్‌లో మాల్దీవుల అధ్యక్షుడిగా ముయిజ్జు (Mohamed Muizzu) అధికారం చేపట్టిన నాటి నుంచి భారత్‌-మాల్దీవుల (Maldives) సంబంధాలు క్షీణించిన విషయం తెలిసిందే. అప్పటికే ప్రధాని మోదీ లక్షద్వీప్‌ పర్యటనపై మాల్దీవుల మంత్రులు మల్షా షరీఫ్‌, మారియమ్‌ సిహునా మరో మంత్రి పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో ఈ ఘటన ఇరుదేశాల మధ్య సంబంధాలను తీవ్రంగా దెబ్బతీసింది. ఈ వివాదం మాల్దీవుల పర్యటక రంగంపై పెను ప్రభావం చూపింది. దీంతో భారత్‌ (India)తో సత్సంబంధాల పునరుద్ధరణకు ముయిజ్జు సర్కారు దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

ఈ క్రమంలోనే అతి త్వరలోనే మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు (Muizzu India Visit) భారత్‌లో పర్యటించనున్నట్లు మంగళవారం రోజున ఆ దేశం ఓ ప్రకటన జారీ చేసింది. అయితే ముయిజ్జు న్యూదిల్లీ పర్యటన గురించి ప్రకటన చేసే కొద్దిసేపటి ముందే మాల్దీవుల కేబినెట్‌లో ఇద్దరు కీలక మంత్రులు తమ పదవుల నుంచి వైదొలిగారు. గతంలో ప్రధాని మోదీ లక్ష్యద్వీప్ (Modi Lakshadweep Tour) పర్యటనపై నోరు పారేసుకున్న ఇద్దరు జూనియర్‌ మంత్రులు మల్షా షరీఫ్‌, మారియమ్‌ సిహునా చేసిన వ్యాఖ్యలతో భారత విదేశాంగ శాఖ విభేదించిన విషయం తెలిసిందే.

అయితే తక్షణ చర్యల్లో భాగంగా వీరిని పదవి నుంచి సస్పెండ్‌ చేశారు. వీరిద్దరూ కేబినెట్‌లో డిప్యూటీ మినిస్టర్లు. అయితే తాజాగా ఈ ఇద్దరు వ్యక్తిగత కారణాల వల్ల తమ పదవులకు రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల మంత్రివర్గం నుంచి వైదొలుగుతున్నట్లు వారు తెలిపారు. మరోవైపు అధ్యక్షుడి (Maldives President) పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను ఇరు దేశాల అధికారులు చర్చించి నిర్ణయించనున్నట్లు మాల్దీవులు పేర్కొంది.

గత ఏడాది ఏప్రిల్‌- జూన్ త్రైమాసికంలో 54,207 మంది భారతీయులు (Indians) మాల్దీవుల్లో పర్యటించగా.. భారత్‌తో వివాదం వల్ల ఈ ఏడాది అదే కాలంలో ఆ సంఖ్య 28,604కి పడిపోయింది. ఇరు దేశాల మధ్య వివాదం ముదురుతుంది అనుకుంటున్న సమయంలో ఈ ఏడాది ప్రధాని మోదీ ప్రమాణస్వీకారానికి మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు హాజరుకావడంతో ఆ దేశ వైఖరిలో మార్పు వచ్చినట్లు సంకేతాలొచ్చాయి.

Share post:

లేటెస్ట్