రైతులకు గుడ్ న్యూస్.. వ్యవసాయ రంగంలో 7 సరికొత్త పథకాలు

Mana Enadu:దేశంలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్న కేంద్ర ప్రభుత్వం (Central Govt) ఇప్పటికే ఆ రంగం అభివృద్ధి కోసం పలు ప్రత్యేక పథకాలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక దేశానికే అన్నపూర్ణగా పేరుగాంచిన భారత్‌లో రైతుల ప్రగతి కోసం మరింత తోడ్పాటు అందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా వ్యవసాయ, అనుబంధ రంగాలకు సంబంధించి ఏడు సరికొత్త పథకాలకు కేంద్ర మంత్రివర్గం (Union Cabinet Meeting) ఆమోదం తెలిపింది. సుమారు 14వేల కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాలు చేపట్టనుంది.

ఈ విషయాన్ని కేంద్ర మంత్రి వర్గ సమావేశం తర్వాత కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Union Cabinet Ashwini Vaishnav) వెల్లడించారు. వ్యవసాయ రంగంలో పరిశోధనలు, విద్య, వాతావరణ మార్పులు, సహజ వనరుల నిర్వాహణ, డిజిటలైజేషన్‌, పాడిపరిశ్రమ, ఉద్యాన పంటలకు ప్రోత్సాహకాలే లక్ష్యంగా సరికొత్తగా ఏడు పథకాలు అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇందు లో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ (Digital Agriculture Mission), క్రాప్ సైన్స్ స్కీమ్, వ్యవసాయ విద్యారంగం, పాడి పశువుల ఆరోగ్యం, ఉత్పత్తి, హార్టికల్చర్, కృషి విజ్ఞాన కేంద్రాలు, సహజ వనరుల నిర్వహణ వంటి పథకాలున్నట్లు చెప్పారు.

కేంద్రం ఆమోదించిన పథకాలు వాటి నిధుల వివరాలు ఇవే :

డిజిటల్ అగ్రికల్చర్ మిషన్- రూ.2,817 కోట్లు
క్రాప్​ సైన్స్ పథకం- రూ.3,979 కోట్లు
వ్యవసాయ విద్యా రంగం బలోపేతం- రూ. 2,291 కోట్లు
పాడిపశువుల ఆరోగ్యం, ఉత్పత్తి పథకం- రూ. 1,702
హార్టికల్చర్ అభివృద్ధి- రూ.860 కోట్ల
కృషి విజ్ఞాన కేంద్రాల బలోపేతం- రూ. 1,202 కోట్లు
సహజ వనరుల నిర్వహణ- రూ. 1,115 కోట్లు

మరోవైపు ఈ కేబినెట్ భేటీలో కేంద్ర మంత్రి వర్గం ముంబయి, ఇందౌర్ (Mumbai To Indore Train) మధ్య 309 కిలోమీటర్ల మేర కొత్త రైలు మార్గం ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. రూ.18,036 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టును 2028-29నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలిపారు. గుజరాత్‌లోని సనంద్‌లో కేనెస్‌ సెమీకండక్టర్‌ తయారీ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపిన కేంద్ర మంత్రి 3,307 కోట్ల పెట్టుబడితో రోజుకు 63లక్షల చిప్‌లు తయారీ సామర్థ్యంతో ఈ పరిశ్రమను ఏర్పాటు చేయన్నట్లు వివరించారు.

Related Posts

Rashmika Mandanna: ‘ఛావా’ ప్రమోషన్స్.. రష్మిక కామెంట్స్‌పై కన్నడిగుల ఫైర్

ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో నేషన్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) జోరు కొనసాగుతోంది. టాలీవుడ్(Tollywood), బాలీవుడ్(Bollywood) అనే తేడా లేకుండా వరుసబెట్టి ఆఫర్లు సొంతం చేసుకుంటోంది. దీంతో దక్షిణాది ఇండస్ట్రీలలో ఆమె పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఇటీవల యానిమల్(Animal), పుష్ప-2(Pushpa2)తో సూపర్…

Gold&Silver Price: తగ్గిన బంగారం ధరలు.. కేజీ వెండి రేటు ఎంతంటే?

గత 15 రోజులుగా చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు(Gold Rates) ఎట్టకులకు తగ్గాయి. ఈనెలలో రికార్డు స్థాయికి చేరిన పుత్తడి ధర సామాన్యులకు అందుబాటులో లేకుండా పైపైకి ఎగబాకింది. ఈ క్రమంలో బంగారు ఆభరణాల(gold jewellery)కు డిమాండ్‌ 80శాతం వరకు పడిపోయింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *