Rain Alert: మరో అల్పపీడనం.. నాలుగు రాష్ట్రాలకు అలర్ట్

Mana Enadu: తెలుగు రాష్ట్రాలను వరుణుడు విడిచిపెట్టడం లేదు. ఇప్పటికే భారీ వర్షాల(Heavy Rains)తో ఆంధ్రప్రదేశ్ (AP), తెలంగాణ(Telangana)లోని ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. నదులు, వాగులు వంకలు వరదనీటితో ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో జనం నానా పాట్లు పడుతున్నారు. ఇప్పటికే విజయవాడ(Vijayawada)ను బుడమేరు(Budameru), ఖమ్మంను మున్నేరు(Munneru) ముంచేసి ప్రాణ, ఆస్తినష్టాన్ని మిగిల్చింది. ఈ వరదల నుంచి తెలుగు ప్రజలు ఇంకా తేరుకోనే లేదు. ఇప్పటికీ పలుచోట్ల సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో మరోసారి వర్షభయం రెండు తెలుగు రాష్ట్రాలను వెంటాడుతోంది. బంగాళాఖాతం(Bay of Bengal)లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో APలో భారీ నుంచి అతిభారీ వర్షాలు, తెలంగాణలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ(IMD) హెచ్చరించింది.

ఏపీ, తెలంగాణతోపాటు ఆరెండు రాష్ట్రాల్లోనూ..

అల్పపీడనం కారణంగా గురువారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇప్పటికే, ఇవాళ APలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో వానలు దంచికొడుతున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఉత్తర ఛత్తీస్‌గఢ్‌(Chattisgarh)పై బలంగా ఉంది. దీని కారణంగా ఛత్తీస్‌గఢ్‌పైతో పాటుగా ఒడిశా(Odisha)లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.

 అప్రమత్తమైన అధికారయంత్రాంగం

మరోవైపు వాతావరణ శాఖ భారీ వర్షాలు(Rains), ఆకస్మిక వరదల(Floods) హెచ్చరికల నేపథ్యంలో అధికారులు(Officials) అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఆయా జిల్లాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి అవసరమైన సహాయక చర్యలు చేపడుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. పలుచోట్ల ముంపు ప్రభావిత ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాల(Safe places)కు తరలించారు. నదీతీర ప్రాంతాలు, వాగులు వంకలు, చెరువుల దగ్గర్లోని గ్రామాలు, పట్టణాల ప్రజలు జాగ్రత్తగా వుండాలని హెచ్చరించారు. మరోవైపు ఇప్పటికే వరద(Flood Effect) ప్రమాదం పొంచివున్న జిల్లాలకు చెందిన మంత్రులు, MLAలు, ఇతర ప్రజా ప్రతినిధులతో పాటు కలెక్టర్లు, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఏ క్షణంలో ఎలాంటి ప్రమాదం చుట్టుముట్టినా సంప్రదించేలా హెల్ప్ లైన్ నంబర్లను(Helpline numbers) విడుదల చేశారు.

Share post:

లేటెస్ట్