IceCream| వీర్యాన్ని కుల్ఫీ ఐస్ క్రీమ్‌ విక్రయాలు.. రాజస్థాన్ వ్యాపారి అరెస్టు

తాను చేసేది గలీజ్ పని అని తెలిసినా ఉద్దేశ్యపూర్వంగా చేశాడు. పైగా, తన వీర్యాన్ని ఐస్‌క్రీమ్, కుల్ఫీల్లో కలిపి విక్రయించాడు. అతని చర్యలన్నీ సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడం, వీటిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యాయి. దీంతో పోలీసులు స్పందించి ఆ వ్యాపారిని అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చాయి.

వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో రోడ్డుపక్కన కుల్ఫీ, ఐస్‌క్రీం దుకాణం నడుపుతున్న ఓ వ్యక్తి హస్తప్రయోగం చేసుకుంటూ తన వీర్యాన్ని ఐస్‌క్రీం లేదా ఫలూడా పాత్రలో కలిపుతూ కనిపించాడు. ఉద్దేశ్యపూర్వకంగానే ఈ పనికి పాల్పడినట్టు తెలుస్తుంది. మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్‌లో ఆ వ్యక్తి ట్రే సైకిల్‌లో స్టాల్‌ నడుపుతున్నాడు.

ఐస్‌క్రీం విక్రయదారుడిని రాజస్థాన్‌కు చెందిన కాలురామ్ కుర్బియాగా గుర్తించిన నెక్కొండ పోలీసులు అతనిపై ఐపిసి సెక్షన్ 294 కింద బహిరంగంగా అసభ్యకరమైన చర్యకు పాల్పడినందుకు కేసు నమోదు చేసినట్లు తమ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. విక్రేత యొక్క అవమానకరమైన చర్య కెమెరాలో రికార్డైంది. పైగా, దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది వైరల్ అయింది. దీంతో రంగంలోకి దిగిన ఫుడ్ ఇన్‌స్పెక్టర్ కృష్ణమూర్తి సహా ఫుడ్ సేఫ్టీ అధికారులు అతని నుంచి తినుబండరాల శాంపిల్స్‌ను సేకరించి పరీక్షలు జరుపుతున్నారు.

Share post:

లేటెస్ట్