Mana Enadu: కేరళలోని వయనాడ్ జిల్లాలో విలయం తాండవిస్తోంది. ఎక్కడచూసిన బురద, మట్టిదిబ్బలే దర్శనమిస్తున్నాయి. అక్కడక్కడా వాటి కింద ఛిద్రమైన మృతదేహాలు కనిపిస్తున్నాయి. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటి వరకు 294 మంది మరణించారు. ఇంకా మండక్కై, చూరాల్‌మల, అత్తమాల, నూల్పుజ ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగున్నాయి. సైన్యం, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఇతర సహాయ బృందాలు రెస్క్యూ ఆపరేషన్‌లో బిజీగా ఉన్నాయి. వర్షాల కారణంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ వరసగా మూడో రోజు సహాయక చర్యలు సాగుతున్నాయి.
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కేరళ పోలీసులు ప్రజలకు, పర్యాటకులకు ఓ సిన్సియర్ రిక్వెస్ట్ చేశారు. ఎక్స్ వేదికగా పోలీసులు చేసిన ఓ పోస్టుతో ఇప్పుడు డార్క్ టూరిజం అనే పదం వైరల్ గా మారింది. ఇప్పుడు దేశమంతా ఈ డార్క్ టూరిజం గురించే చర్చించుకుంటోంది. ఇంతకీ ఈ డార్క్ టూరిజం అంటే ఏంటి…? వయనాడ్ విలయానికి దానికి సంబంధం ఏంటి..? కేరళ పోలీసులు చేసిన పోస్టు ఏంటి..?
కేరళ పోలీసులు ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘‘పర్యటనల కోసం విపత్తు ప్రాంతాలకు వెళ్లకండి. దానివల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది. సహాయం కోసం 112కు కాల్ చేయండి. డార్క్ టూరిజంలో భాగంగా పర్యాటకులు ఆ విపత్తు ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంది. అలా వస్తే.. సహాయక చర్యలకు ఆటంకం కలిగే అవకాశం ఉంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎవరూ అక్కడికి రావొద్దు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వందలాది మంది ప్రజల ఆచూకీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాం. అందుకే సందర్శకులు రావొద్దు అని ఎక్స్ వేదికగా కేరళ పోలీసులు కోరారు. ఇలా డార్క్ టూరిజం అనే పదాన్ని పోలీసులు వాడటంతో ఇప్పుడు అందరూ దీని గురించి వెతకడం ప్రారంభించారు.
డార్క్ టూరిజం అంటే ఏంటి..?
మరణం, విషాదం, హింస, అసాధారణ పరిస్థితులు జరిగిన ప్రాంతాలను సందర్శించడాన్ని డార్క్ టూరిజం అంటారు. యుద్ధభూమి, జైలు, మార్చురీ, మాసోలియంలు (సమాధులు), ఉరి తీసిన ప్రాంతాలు, విపత్తు సంభవించిన ప్రదేశాలు ఉంటాయి. ఉదాహరణకు ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో రియాక్టర్ పేలిపోవడంతో.. భారీ ఆస్తినష్టంతో పాటు ప్రాణనష్టం సంభవించింది. ఇప్పుడది డార్క్ టూరిజంలో ఒక డెస్టినేషన్‌గా మారింది. అలాగే పోలెండ్‌లోని ఆష్విట్జ్ క్యాంప్, కాంబోడియాలోని కిల్లింగ్ ఫీల్డ్స్, అమెరికాలోని 9/11 మెమోరియల్ వంటివి ఈ డార్క్ టూరిజం డెస్టినేషన్లుగా ఉన్నాయి.
డార్కి టూరిజం గురించి ఎలా తెలిసింది..?
ఆ ప్రదేశాల చరిత్ర తెలుసుకోవాలని దాన్ని ప్రపంచానికి తెలియజేయాలని.. అక్కడి విషాదాన్ని ప్రత్యక్షంగా అనుభవించిన వారి ఉద్వేగాలతో కనెక్ట్ అవ్వాలని.. వారి ఎమోషన్ ను ప్రపంచం చూడాలని డార్క్ టూరిస్టులు ఈ డెస్టినేషన్ లో పర్యటిస్తుంటారు. ‘చెర్నోబిల్’, ‘ద డార్క్ టూరిస్ట్’ వంటి వెబ్ సిరీస్‌ల ద్వారా జనాలకు డార్క్ టూరిజం గురించి తెలిసింది. అయితే సహాయక చర్యలు జరుగుతోన్న సమయంలో ఆ పర్యటకులు వస్తే ఆటంకం కలుగుతుందనే ఉద్దేశంతో కేరళ పోలీసులు ముందస్తు హెచ్చరిక చేశారు.
Rashmika Mandanna: ‘ఛావా’ ప్రమోషన్స్.. రష్మిక కామెంట్స్‌పై కన్నడిగుల ఫైర్
ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో నేషన్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) జోరు కొనసాగుతోంది. టాలీవుడ్(Tollywood), బాలీవుడ్(Bollywood) అనే తేడా లేకుండా వరుసబెట్టి ఆఫర్లు సొంతం చేసుకుంటోంది. దీంతో దక్షిణాది ఇండస్ట్రీలలో ఆమె పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఇటీవల యానిమల్(Animal), పుష్ప-2(Pushpa2)తో సూపర్…