Bigg Boss 8 Telugu: ఇది ఊహించలేదు భయ్యా.. సెకండ్ వీక్ ఎలిమినేషన్‌ ఎవరంటే?

ManaEnadu:బిగ్‌బాస్‌ సీజన్‌-8 (Bigg Boss 8) రెండో వారం కూడా ముగిసిపోయింది. ఈ వారం హౌజ్ నుంచి రేడియో జాకీ శేఖర్‌బాషా (Shekar Basha) ఎలిమినేట్‌ అయ్యాడు. సెకండ్ వీక్ నామినేషన్స్‌లో విష్ణుప్రియ, కిర్రాక్‌ సీత, పృథ్వీరాజ్‌, శేఖర్‌బాషా, నైనిక, నిఖిల్‌, నాగ మణికంఠ, ఆదిత్య ఓం ఉండగా.. చివరకు ఆదిత్య ఓం, శేఖర్‌ బాషా మిగిలారు.

అతడే ఎలిమినేట్

ఇక ఈ ఇద్దరిలో హౌస్‌లో ఉండేందుకు ఎవరు అర్హులో వాళ్ల మెడలో పూలదండ వేయమని హోస్టు నాగార్జున కంటెస్టెంట్లకు సూచించడంతో ఒక్కరు తప్ప మిగతా హౌస్​మేట్స్ అందరూ.. ఆదిత్య ఓం (Adithya Om) మెడలో పూలదండ వేశారు. గత వారం రోజుల నుంచి శేఖర్‌బాషా ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదని, కొడుకు పుట్టాడని తెలిసిన తర్వాత ఇంకా ఎక్కువ ఎమోషనల్​ అయి ఆటపై ఫోకస్ పెట్టడం లేదని హౌస్​మేట్స్ చెప్పారు. అయితే కిర్రాక్‌ సీత మాత్రమే శేఖర్‌బాషా మెడలో మాల వేసినా ఒక్క ఓటే రావడంతో శేఖర్‌ ఎలిమినేట్‌ (shekar basha eliminated) అయినట్లు నాగార్జున ప్రకటించారు.

రియల్ పీపుల్ వీళ్లే..

ఇక ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్​తో ఎప్పుడూ ఏదో ఒకట ఆడించడం బిగ్​బాస్​కు అలవాటే. ఈ క్రమంలోనే శేఖర్ బాషా వెళ్లిపోయే ముందు నాగార్జున (Nagarjuna).. హౌస్‌లో ఉన్న ముగ్గురు రియల్‌, ఫేక్‌ పీపుల్‌ ఎవరో చెప్పమని అడిగారు. అందుకు అతను సీత, విష్ణుప్రియ, ప్రేరణ రియల్ పీపుల్ అని చెప్పుకొచ్చాడు. సీత మనస్ఫూర్తిగా మాట్లాడుతుందని, ముక్కుసూటి మనస్తత్వం తనదని చెప్పాడు.

ఆమె చాలా అమాయకురాలు

మరోవైపు విష్ణుప్రియ(Vishnu Priya) చాలా అమాయకురాలు అని, ఎలా బతుకుతుందో ఏంటో అని అన్నాడు శేఖర్ బాషా. ఇక ప్రేరణ గురించి చెబుతూ కొన్ని విషయాల్లో ఆమె నచ్చకపోయినా.. చాలా విషయాల్లో నిజాయతీ కలిగిన వ్యక్తి అని శేఖర్ బాషా తెలిపాడు. చాలా ఎనర్జిటిక్​గా ఉంటుందని, స్వచ్ఛమైన మనసు అని ప్రశంసించాడు.

బిగ్​బాస్ హౌస్​లో ఫేక్ పీపుల్

ఇక ఫేక్ పీపుల్ గురించి అడగ్గా, సోనియా (Sonia), మణికంఠ, ఆదిత్య ముగ్గురు ఈ హౌస్​లో ఫేక్ పీపుల్ అని చెప్పాడు శేఖర్ బాషా. నామినేషన్స్​లో సోనియా మహంకాళి అవతారం చూశానని, అది తనకు నచ్చలేదని చెప్పాడు. మణికంఠ (Manikanta) గురించి చెబుతూ కావాలని ఫేక్‌ ఫేస్‌ పెట్టుకుంటాడని, ఎవరిపైనైనా కోపం ఉన్నా ఆ విషయం చెప్పకుండా దాచి, లెక్కలు వేసుకుని, ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతాడని తెలిపాడు. ఇక ఆదిత్య ఓం తనను నామినేట్‌ చేసినప్పుడు తాను తేలిగ్గానే తీసుకున్నా అతడు అలా తీసుకోలేదని చెప్పాడు శేఖర్ బాషా.

 

Share post:

లేటెస్ట్