Mana Enadu: ‘‘మనం కేవలం వన్ పర్సంట్ ఛాన్స్ మాత్రమే ఉందనుకుందాం. ఏదైనా సాధించడానికి ఒక్కోసారి ఆ వన్ పర్సెంట్ సరిపోతుంది. కానీ, దాన్ని ఎలా అందిపుచ్చుకోవాలనేదే చాలా ఇంపార్టెంట్. చివరి వరకూ శ్రమిస్తే.. ఒక్క శాతం 10కి పెరుగుతుంది. ఇంకాస్త కష్టపడితే 10 30కి.. 30 యాభైకి.. ఇలా.. నిరంతరం సాధన చేయడం వల్ల చివరకు ఏదో మ్యాజిక్ మనల్ని విజయం వైపు నడిపుస్తుంది.’’ ఈ డైలాగ్ వినగాన్ ప్రతి క్రికెట్ ఫ్యాన్ మదిలో మెదిలేది ది కింగ్, టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి. ఎప్పుడైనా విరాట్ కెరీర్ పై సినిమా వస్తే అందులో ఈ డైలాగ్ తప్పకుండా ఉంటుందని ఫ్యాన్స్ తరచూ సోషల్ మీడియాలో చర్చించుకుంటూ ఉంటారు.
దిల్లీలోని ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన కోహ్లీ ఇప్పుడు ప్రపంచంలోనే ది ఫేమస్ క్రికెటర్లలో ఒకడిగా.. ఏకంగా క్రికెట్ ఫేస్ గా మారడం అంత ఈజీగా జరగలేదు. ఎన్నో నిద్రలేని రాత్రులు.. ఎన్నెన్నో ఒడుదొడుకులు.. మరెన్నో అవమానాలు.. దీటుగా ఎదుర్కొని ఇండియన్ క్రికెట్ హిస్టరీలో తనకంటూ ఓ పేజీ రాసుకునే స్థాయికి తీసుకొచ్చాయి. ఈ కారణంగానే కోహ్లీ జీవితకథను స్క్రీన్ మీదకు తీసుకురావాలనే అంశం తెరపైకి వచ్చింది.
కోహ్లీ గేమ్ స్టైల్, కిందపడ్డ ప్రతిసారి డబుల్ స్పీడ్ తో పైకి లేచే నైజం, గేమ్ లో అగ్రెషన్, ఫీల్డ్ బయట కూల్ నెస్, ఫ్యామిలీతో జాలీగా ఎంజాయ్ చేసే తీరు.. ఇలా కోహ్లీ తన లైఫ్ లో పోషించే ప్రతి పాత్రను అభిమానులు బిగ్ స్క్రీన్ పై చూడాలని ఆశపడుతుంటారు. దీంతో కోహ్లీ బయోపిక్ లో ఈ ఆడగాడి పాత్రలో నటించడానికి ఎవరు సరిపోతారనే అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. బాలీవుడ్ హీరోల్లో కోహ్లీ పాత్రకు న్యాయం చేయగలిగే నటులు ఎవరున్నారు.
రణ్వీర్ సింగ్ : కోహ్లీ బయోపిక్ అనగానే చాలా మందికి మొదట గుర్తొచ్చిన పేరు రణవీర్ సింగ్. 83లో కపిల్ దేవ్ పాత్రలో నటించి క్రికెటర్ గా తను పర్ఫెక్ట్ గా నటించగలనని ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఈ హీరో ఎనర్జీ కోహ్లీ దూకుడుకు కరెక్ట్ గా సెట్ అవుతుందని అందుకే రణ్ వీర్ సరైన ఛాయిస్ అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
విక్కీ కౌశల్ : ప్రజెంట్ బాలీవుడ్ లో మోస్ట్ హాప్పెనింగ్ హీరో విక్కీ. చేస్తున్న ప్రతి సినిమా సూపర్ హిట్. ఒక చిత్రానికి ఇంకో మూవీకి అసలు పొంతన ఉండదు. డిఫరెంట్ జానర్ లో తన నటనతో అదరగొడుతున్నాడు. లవ్ స్టోరీ అయినా.. పేట్రియాటిక్ సినిమా అయినా.. కమర్షియల్ చిత్రమైనా విక్కీ ఉంటే సూపర్ హిట్. ఎమోషన్ ను క్యాచ్ చేయడంలో విక్కీ సిద్ధహస్తుడు. అందుకే విరాట్ పాత్రలో విక్కీ సెట్ అవుతాడని టాక్. ఇంకోవిషయముందండోయ్ ఈ ఇద్దరూ పంజాబీ బాయ్స్. ఇద్దరికీ డ్యాన్స్ అంటే బాగా ఇష్టం.
షాహిద్ కపూర్ : పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం ఒక స్కిల్ అయితే.. పాత్ర కోసం ట్రాన్స్ ఫామ్ అవ్వడం మరో స్కిల్. అలా తన ట్రాన్స్ఫర్మేటివ్ యాక్టింగ్ స్కిల్ తో.. కబీర్ సింగ్ వంటి ఆల్ఫామేల్ పాత్రల్లో నటించిన ఎక్స్ పీరియన్స్ తో షాహిద్ కపూర్ క్రికెటర్ కోహ్లీ పాత్రకు సరిపోతాడని కొందరి వాదన.
హృతిక్ రోషన్ : ఈ గ్రీక్ గాడ్.. లుక్స్ లోనూ.. స్క్రీ ప్రెజెన్స్ లోనూ ఏ హాలీవుడ్ హీరోకు తీసిపోడు. ఇక ఫిట్ నెస్ ఫ్రీక్ హృతిక్. అందుకే పాత్ర ఏదైనా ఈజీగా చేసేస్తాడు. ఇక యాక్షన్ సీక్వెన్స్ లో హృతిక్ కు పోటీనే లేదు. అందుకే ఫిట్ నెస్ ఫ్రీక్ అయిన కోహ్లీ పాత్రకు హృతిక్ పర్ఫెక్ ఛాయిస్ అంటున్నారు కొందరు ఫ్యాన్స్.
వీరే కాకుండా ఈ లిస్టులో ఇంకా జాన్ అబ్రహం, సిద్ధార్థ్ మల్హోతార్, డైగర్ ష్రాఫ్, ఆయుష్మాన్ ఖురానా కూడా ఉన్నారు. కింగ్ కోహ్లీ పాత్రకు ఎవరు కరెక్ట్ గా సెట్ అవుతారని మీరు అనుకుంటున్నారు?