ManaEnadu:బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల అంశంపై తలెత్తిన నిరసనలు హింసాత్మకంగా మారడం వల్ల అధికార ప్రభుత్వం కూలిపోయింది. ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశాన్ని వీడి భారత్ కు వచ్చారు. ఈ నేపథ్యంలో యూనస్ ఖాన్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అయితే ఆమె దేశాన్ని వీడిన తర్వాత కూడా బంగ్లాదేశ్ లో అల్లర్లు తగ్గుముఖం పట్టలేదు. ముఖ్యంగా ఆ దేశంలో హిందువులపై దాడులు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ లో హిందువుల రక్షణపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
అయితే తాజాగా ఈ అంశంపై ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు మహమ్మద్ యూనస్‌ఖాన్ స్పందించారు. బంగ్లాదేశ్‌లోని హిందువులు, ఇతర మైనారిటీలకు రక్షణ కల్పిస్తామని ఆయన మాటిచ్చారు. ప్రొఫెసర్ యూనస్ ఖాన్ తనకు ఫోన్ చేసి మాట్లాడినట్లు మోదీ తెలిపారు. ప్రజాస్వామ్య, సుస్థిర, శాంతియుత, ప్రగతిశీల బంగ్లాదేశ్ కోసం భారత దేశ మద్దతు కొనసాగుతుందని యూనస్‌కు స్పష్టం చేసినట్లు మోదీ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో బంగ్లాదేశ్‌లో మైనారిటీల పరిస్థితిని మోదీ ప్రస్తావించిన విషయం తెలిసిందే. బంగ్లాలో హిందువులపై దాడుల విషయంలో 140 కోట్ల మంది భారతీయులు ఆందోళన చెందుతున్నట్లు చెప్పారు. ఆ దేశంలో జనజీవనం త్వరలోనే సాధారణ స్థితికి వస్తుందని ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలోనే యూనస్‌ఖాన్ ప్రధాని మోదీకి ఫోన్ చేసి ప్రస్తుత పరిస్థితిని వివరించినట్లు సమాచారం.
బంగ్లాదేశ్‌లో పరిస్థితి అదుపులోకి వచ్చిందని యూనస్ ఖాన్ మోదీకి తెలిపినట్లు తెలిసింది. శనివారం వర్చువల్‌గా జరగనున్న వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్‌లో పాల్గొనాలన్న మోదీ ఆహ్వానానికి యూనస్ అంగీకరించినట్లు సమాచారం.
Rashmika Mandanna: ‘ఛావా’ ప్రమోషన్స్.. రష్మిక కామెంట్స్‌పై కన్నడిగుల ఫైర్
ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో నేషన్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) జోరు కొనసాగుతోంది. టాలీవుడ్(Tollywood), బాలీవుడ్(Bollywood) అనే తేడా లేకుండా వరుసబెట్టి ఆఫర్లు సొంతం చేసుకుంటోంది. దీంతో దక్షిణాది ఇండస్ట్రీలలో ఆమె పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఇటీవల యానిమల్(Animal), పుష్ప-2(Pushpa2)తో సూపర్…