Mana Enadu: ప్రొ కబడ్డీ లీగ్ (Pro Kabaddi League) 11వ సీజన్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సొంత గడ్డపై జరిగిన తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్(Telugu Titans) బోణీ కొట్టింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టైటాన్స్ 37-29 తేడాతో బెంగళూరు బుల్స్(Bengaluru Bulls)పై గ్రాండ్ విక్టరీ కొట్టింది. గేమ్ ప్రారంభం నుంచే ఎటాకింగ్‌కు దిగిన టైటాన్స్ చివరి వరకూ అదే జోరు కొనసాగించింది. ఈ క్రమంలో బెంగళూరుపై 8 పాయింట్ల తేడాతో గెలుపొంది 11వ సీజన్(Season 11)ను ఘనంగా ఆరంభించింది.
1200 రైడ్ పాయింట్స్ సాధించిన సెహ్రావత్
ఈ మ్యాచులో టైటాన్స్ కొత్త కెప్టెన్ పవన్ సెహ్రావత్(Pawan Sehrawat)(13 పాయింట్లు) రైడింగ్‌లో సూపర్-10తో విజృంభించాడు. మరోవైపు డిఫెండర్ క్రిషన్ ధుల్(Krishan Dhul)(6)రాణించడంతో టైటాన్స్ ఈజీగా గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో పవన్ PKLలో 1200 రైడ్ పాయింట్ల మైలురాయిని అందుకోవడం మరో విశేషం. మరోవైపు బెంగళూరు జట్టులో సురీందర్ దహల్(5), జతిన్(4) టాప్ స్కోరర్లుగా నిలిచారు. మొత్తంగా ఈ మ్యాచులో టైటాన్స్ 17 రైడ్ పాయింట్స్, 15 టాకిల్ పాయింట్స్, 4 సార్లు ఆలౌట్ పాయింట్లు సాధించింది.
నేడూ రెండు మ్యాచ్‌లు
ఇదిలా ఉంటే ఇదే వేదికపై జరిగిన మరో మ్యాచులో దబాంగ్ ఢిల్లీ(Dabang Delhi) 36-28తో యు ముంబా(U Mumba)పై విజయం సాధించింది. అషు మాలిక్(10) ఢిల్లీ విజయంలో కీలకంగా వ్యవహరించాడు. రైడింగ్‌లో ఢిల్లీ ప్లేయర్లు విఫలమైనా టాకిల్స్(Tackles)లో అదరగొట్టారు. రెండు సార్లు యు ముంబాను ఆలౌట్ చేయడంతోపాటు 9 ఎక్స్‌ట్రా పాయింట్లు సాధించడంతో యు ముంబాపై విజయం సాధించింది. కాగా ఈరోజు రాత్రి 8 గంటలకు జరిగే మ్యాచ్‌లో టైటాన్స్ జట్టు తమిళ్ తలైవాస్(Titans vs Tamil Thalaivas)తో, రాత్రి 9 గంటలకు జరగనున్న మరో మ్యాచులో పుణేరి పల్టాన్స్ జట్టు హరియాణా స్టీలర్స్(Puneri Paltans vs Haryana Steelers)తో తలపడనున్నాయి.
https://twitter.com/BhargavA_1098/status/1847363092612833494