HYD| సింగిరెడ్డి కోసం రంగంలోకి KTR

మన ఈనాడు: ఉప్పల్ కాంగ్రెస్ టిక్కెట్ ఆశించిన సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి టిక్కెట్ దక్కకపోవడంతో దంపతులు ఇద్దరూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ముఖ్య అనుచరులుగా సింగిరెడ్డి దంపతులు ఉన్నారు

రంగంలోకి దిగిన KTR
శనివారం సాయంత్రమే దాసోజు శ్రవణ్ సింగిరెడ్డిను కలిసి BRS పార్టీలోకి ఆహ్వానం పలికారు. AS రావు నగర్ కార్పొరేటర్ గా సోమశేఖర్ రెడ్డి సతీమణి శిరీష రెడ్డి గెలిచారు. ఈ రోజు సాయంత్రం మంత్రి KTR నేరుగా కుషాయిగూడ లోని సింగిరెడ్డి నివాసానికి వచ్చి పార్టీలోకి ఆహ్వానం పలికేందుకు ఏర్పాట్లు సైతం జరుగుతున్నట్లు సమాచారం.

ఉప్పల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బలంగా ఉండటంతో పాటు అదే పార్టీ నుంచే బయటకు వస్తున్న నేతలకు అధికార పార్టీ ఉన్నత పదవులు అందించడానికి వెనకడుగు వేయడం లేదు.ఉప్పల్ రాజకీయాలు గ్రేటర్ లో రసవత్తరంగా మారాయి.

Share post:

లేటెస్ట్