
రంజాన్ మాసం(The month of Ramzan) సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు తెలంగాణ సర్కార్(Telangana Govt) శుభవార్త చెప్పింది. ముస్లిం ఉద్యోగులు(Muslim employees) తమ పని వేళల కంటే గంట ముందే ఇళ్లకు వెళ్లేలా సీఎం రేవంత్(CM Revanth) వెసులుబాటు కల్పించారు. ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో పని చేస్తున్న ముస్లిం ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు March 2 నుంచి 31 వరకు సా.4 గంటలకే తమ ఇళ్లకు వెళ్లేలా అనుమతి కల్పించారు. CM రేవంత్ ఆదేశాల మేరకు తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి(Chief Secretary Shantikumari) సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో పని చేస్తున్న ముస్లిం ఉద్యోగులు, టీచర్లు, కాంట్రాక్ట్ వర్కర్లు అందరికీ ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి.
View this post on Instagram
ఏపీలోని ఉద్యోగులకూ అవకాశం
రంజాన్ మాసంలో ఉపవాస దీక్షల నేపథ్యంలో అటు APలోని కూటమి సర్కార్ సైతం ముస్లిం ఉద్యోగులకు పనివేళ్లలో మార్పులు కల్పించింది. మార్చి 2వ తేదీ నుంచి మార్చి 30వ తేదీ వరకూ రంజాన్(Ramzan) మాసం మొత్తం అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులు గంట ముందుగానే ఇళ్లకు వెళ్లేందుకు అవకాశం ఇచ్చింది. ఉపాధ్యాయులు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పాటుగా ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు విధులు నిర్వహిస్తున్న ముస్లిం ఉద్యోగులందరికీ వెసులుబాటు కల్పించింది. అలాగే ముస్లింలకు రంజాన్ తోఫా(Ramzan Thofa) అందించాలని సీఎం చంద్రబాబు(CM Chandrababu) నిర్ణయించారు.