
చాలా మంది విద్యార్థులు పదో తరగతి తర్వాత ఏం చదవాలోననే ఆందోళనలో ఉంటారు. కొందరు ఇంటర్(Intermediate) వైపు అడుగులు వేస్తే.. మరి కొందరు పాలిటెక్నిక్(Polytechnic), ఇతర ఒకేషనల్ కోర్సుల(Vocational courses)పై వెళ్తుంటారు. అయితే ఇంజినీరింగ్(Engineering), ఎలక్ట్రికల్ విద్యపరంగా పాలిటెక్నిక్ చేస్తే ఉపాధి అవకాశాలు త్వరగా లభిస్తాయని పలువురు నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో పాలిటెక్నిక్ కాలేజీలలో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్(Polycet-2025) దరఖాస్తుల ప్రక్రియ ఇవాళ్టి (మార్చి 19) నుంచి ప్రారంభంకానుంది. ఈమేరకు షెడ్యూల్ విడుదలైంది.
ఆలస్య రుసుంతో ఏప్రిల్ 21 వరకు ఛాన్స్
విద్యార్థులు వచ్చే నెల 19వ తేదీ వరకు అప్లికేషన్ల(Appications)కు అవకాశం ఉంది. SC, STలకు రూ.250, ఇతర విద్యార్థులకు రూ.500 ఫీజుగా నిర్ణయించారు. రూ.100 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 21 వరకు, రూ.300తో 23 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్టు టెక్నికల్ బోర్డు. ఇక మే13వ తేదీన పాలిసెట్ ప్రవేశ పరీక్ష(Polyset Entrance Test) నిర్వహించనున్నట్టు పేర్కొంది. పరీక్షలు పూర్తయిన 12 రోజుల తర్వాత రిజల్ట్స్ వెల్లడించనున్నారు. మరిన్ని వివరాలకు www.polycet.sbtet.telangana.gov.in లేదా 80352-33929 నంబర్ను సంప్రదించవచ్చని సూచించారు. కాగా ఇంజినీరింగ్, ఇతర వృత్తి విద్యాకోర్సులకు ఇటీవల ప్రభుత్వం జారీచేసిన నిబంధనల మాదిరిగానే పాలిటెక్నిక్ సీట్లన్నీ తెలంగాణ విద్యార్థుల(Telangana Students)కే కేటాయించనున్నారు.