దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ లియో. ఈ భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ ముందుగా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఈ కు పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.
ఇప్పుడు బ్లాక్ బాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. దాంతో లియో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ సక్సెస్ మీట్ లో దళపతి విజయ్ సూపర్ స్పీచ్ ఇచ్చారు. లియో కు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించారు. విక్రమ్, ఖైదీ లకు లింక్ చేస్తూ లియో ను తెరకెక్కించారు లోకేష్. లోకేష్ తో విజయ్ మాస్టర్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు లియో చేశారు.ఈ కు మంచి కలెక్షన్స్ సాధించింది. లియో సక్సెస్ మీట్ లో విజయ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
ఇక తమిళ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్, దళపతి విజయ్ అభిమానుల మధ్య చాలా కాలంగా వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ అభిమానులు కొట్టుకుంటుంటారు. ఇప్పటికే చాలాసార్లు ఇలా ఫ్యాన్స్ వార్స్ జరిగాయి. తాజాగా విజయ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
నెహ్రూ ఇండోర్ స్టేడియంలో లియో సక్సెస్ మీట్ ను భారీ ఎత్తున నిర్వహించారు. ఈ వేడుకలో విజయ్ డ్యాన్స్ చేసి పాట కూడా పాడారు. ‘సూపర్ స్టార్ ఎవరనే విషయంపై క్లారిటీ ఇస్తూ.. పురట్చి తలైవర్ (ఎంజీఆర్) ఒక్కరే. నడిగర్ తిలగం (శివాజీ గణేషన్)ఒక్కరే. పురట్చి కలైంజ్ఞర్ (కరుణానిధి) ఒక్కరే.అలాగే విశ్వనటుడు (కమలహాసన్) ఒక్కరే. సూపర్ స్టార్ (రజనీకాంత్) ఒక్కరే. తల(అజిత్) ఒక్కరే. ఇక దళపతి అంటారా (విజయ్) నాకు సంబంధించినంత వరకు దళపతి అంటే రాజుల ఆజ్ఞను పూర్తి చేసేవాడు. నాకు తెలిసి రాజులు అంటే ప్రజలే.. ప్రజలు ఏం చెప్తే నేను అదే చేస్తా.. అని అన్నారు విజయ్.