నానీతో ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి), పవన్ కల్యాణ్తో (Pawan Kalyan) వకీల్ సాబ్ (Vakeel saab) లాంటి సినిమాలు తీసిన దర్శకుడు శ్రీరామ్ వేణు చాలా గ్యాప్ తర్వాత నితిన్ (Nithiin) హీరోగా తెరకెక్కించిన మూవీ ‘తమ్ముడు’ (Thammudu). సప్తమీ గౌడ (Sapthami Gowda), వర్ష బొల్లమ్మ (Varsha Bollamma) హీరోయిన్లు. చాలా ఏళ్ల తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న సీనియర్ నటి లయ (Laya) నితిన్కు అక్కగా కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా జులై 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రిలీజ్ ట్రైలర్ (Thammudu Trailer)ను ఫిల్మ్ టీమ్ తాజాగా విడుదల చేసింది. ఆర్చరీ ప్లేయర్గా నటిస్తున్న నితిన్.. అక్కతో ‘తమ్ముడు’ అని పిలిపించుకోవడం కోసం ఎంత సాహసమైన చేసే పాత్రలో కనిపించనున్నాడు. ఆసక్తికరంగా ఉన్న ట్రైలర్ను మీరూ చూసేయండి.






