
నాగచైతన్య(Naga Chaitanya), సాయిపల్లవి(Sai Pallavi) జంటగా నటించిన ‘తండేల్(Thandel)’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలి షోతోనే పాజిటివ్ టాక్ అందుకుంది. చందూ మొండేటి(Director Chandu Mondeti) దర్శకత్వం వహించిన ఈ మూవీని అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఆర్ట్స్ సమర్పణలో బన్నీ వాసు(Bunny Vasu) నిర్మించారు. నాలుగు రోజుల్లో ‘తండేల్’ మూవీ రూ. 73.2 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన ఈ మూవీ తాజగా ఆ రికార్డును బ్రేక్ చేసింది. వర్కింగ్ రోజుల్లోనూ చిత్రానికి అనూహ్య స్పందన వస్తుండటంతో కలెక్షన్ల(Collections) పర్వం కొనసాగుతోంది.
రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరడం ఖాయం!
రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన ‘తండేల్ ‘మూవీకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్(DSP) మ్యూజిక్ అందించాడు. ప్రేమ కథ, దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగ చైతన్య-సాయిపల్లవి నటన, డ్యాన్స్ సూపర్‌గా ఉందంటూ అభిమానులు కొనియాడుతున్నారు. అటు చైతూ కెరీర్లోనే ఈ సినిమా పెద్ద హిట్‌గా నిలిచింది. కాగా ఈ మూవీ సినిమా బాక్సాఫీస్(Boxoffice) వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన 5 రోజుల్లోనే ఈ చిత్రం రూ.80.12 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు చేసినట్లు చిత్ర యూనిట్ ట్వీట్(Tweet) చేసింది. వాలంటైన్స్ వీక్(Valentine’s week)లో బ్లాక్ బస్టర్ తండేల్‌పై ప్రేమ అన్‌స్టాపబుల్‌గా కొనసాగుతుందని పేర్కొంది. కాగా ఇదే ఊపు కొనసాగితే రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
The love for #BlockbusterThandel Is unstoppable this Valentine’s Week ❤️#Thandel grosses 𝟖𝟎.𝟏𝟐 𝐂𝐑𝐎𝐑𝐄𝐒 𝐖𝐎𝐑𝐋𝐃𝐖𝐈𝐃𝐄 in 5 days ❤🔥
Book your tickets now!
🎟️ https://t.co/5Tlp0WMUKb#BlockbusterLoveTsunami pic.twitter.com/hRPzWffho3— Thandel (@ThandelTheMovie) February 12, 2025