
యదార్థ సంఘటనల ఆధారంతో పాకిస్థాన్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన చిత్రం తండేల్(Thandel). అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), సాయిపల్లవి(Sai Pallavi) కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సాధించింది. ఫిబ్రవరి 7న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా రూ.115 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది. చందూ మొండేటి తెరకెక్కించిన ఈ మూవీని ఈనెల 7న ప్రముఖ OTT ఫ్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్(Netflix)లో రిలీజ్ చేశారు. దీంతో ఓటీటీలోనూ సూపర్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది తండేల్. తాజాగా ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో దేశవ్యాప్తంగా నం.1గా ట్రెండ్ అవుతోందని నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్(Geetha Arts) ట్వీట్ చేసింది. బ్లాక్‌బస్టర్ సునామీ ప్రేక్షకులకు ఫేవరెట్‌గా మారిందని పేర్కొంది.
#BlockbusterLoveTsunami is an audience favourite ❤️#Thandel TRENDING #1 Indiawide on #Netflix ❤️🔥
Now streaming in Telugu, Hindi, Tamil, Kannada and Malayalam 🤩
🔗 https://t.co/wZCD11S2U4#BlockbusterLoveTsunami
Yuvasamrat @chay_akkineni @Sai_Pallavi92 @chandoomondeti… pic.twitter.com/FYylg4XJg8— Geetha Arts (@GeethaArts) March 12, 2025
చైతూ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్
కాగా ఈ సినిమాలో నాగ చైతన్య తండేల్ రాజు అనే పాత్రలో అదరగొట్టాడు. చైతూ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక డాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి నటనకు వంక పెట్టాల్సిన ఛాన్సే లేదు. ఇందులో ఆమె నాగ చైతన్య ప్రేయసి బుజ్జితల్లి(Bujjithalli)గా యాక్ట్ చేసింది. వీరితో పాటు కరుణాకరణ్, ప్రకాశ్ బెలావాడి, దివ్య పిళ్లై, పృథ్వీ, కళ్యాణీ నటరాజన్, కల్పలత తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక దేవి శ్రీ ప్రసాద్(DSP) అందించిన పాటలు చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. అయితే సినిమా విడుదలైన రోజే HD ప్రింట్ ఆన్లైన్‌లో ప్రత్యక్షమైంది. దీనిపై నిర్మాత బన్నీవాసు(Bunny vasu) పైరసీ వల్ల చాలా నష్టపోయామని మీడియా వేదికగా ఓ ఇంటర్వ్యూలో వాపోయాడు. అయిన ఆడియన్స్ తమ సినిమాను ఆదరించారని కొనియాడిన విషయం తెలిసిందే.